https://oktelugu.com/

ఆర్ఆర్ఆర్ పై క్లారిటీ ఇచ్చిన ఆలియా భట్‌

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ మృతి హిందీ చిత్ర పరిశ్రమను కుదిపేసింది. ఇండస్ట్రీలో బంధుప్రీతి అంశం చర్చనీయాంశమైంది. బాలీవుడ్‌ కొన్ని కుటుంబాల గుప్పిట్లోనే ఉందని, వారసుల పిల్లలకే అవకాశాలకు ఇస్తున్నారని, ఇతర ప్రతిభావంతులను తొక్కేస్తున్నారన్న విమర్శలు చెలరేగాయి. సుశాంత్‌ మరణానికి ఇదే కారణం అన్న ఆరోపణలు వచ్చాయి. బాలీవుడ్‌ను ఏలుతున్న కపూర్, భట్‌, ఖాన్ల కుటుంబ సభ్యలుపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. వాళ్లను, వాళ్ల సినిమాలను బ్యాన్‌ చేయాలని పలువురు డిమాండ్‌ చేశారు. సుశాంత్‌ మరణం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 27, 2020 / 04:01 PM IST
    Follow us on


    బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ మృతి హిందీ చిత్ర పరిశ్రమను కుదిపేసింది. ఇండస్ట్రీలో బంధుప్రీతి అంశం చర్చనీయాంశమైంది. బాలీవుడ్‌ కొన్ని కుటుంబాల గుప్పిట్లోనే ఉందని, వారసుల పిల్లలకే అవకాశాలకు ఇస్తున్నారని, ఇతర ప్రతిభావంతులను తొక్కేస్తున్నారన్న విమర్శలు చెలరేగాయి. సుశాంత్‌ మరణానికి ఇదే కారణం అన్న ఆరోపణలు వచ్చాయి. బాలీవుడ్‌ను ఏలుతున్న కపూర్, భట్‌, ఖాన్ల కుటుంబ సభ్యలుపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. వాళ్లను, వాళ్ల సినిమాలను బ్యాన్‌ చేయాలని పలువురు డిమాండ్‌ చేశారు. సుశాంత్‌ మరణం వెనుక అతని ప్రేయసి రియా చక్రవర్తి హస్తం ఉందని ఆరోపణలు రావడంతో ఆమె చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అదే టైమ్‌లో రియాకు నిర్మాత మహేశ్‌ భట్‌కు సన్నిహిత సంబంధం ఉందంటూ కొన్ని ఫొటోలు, వాట్సప్‌ చాట్స్‌ బయటకు వచ్చాయి.

    Also Read: ఆ ఫ్లాప్‌ మూవీ సీక్వెల్‌ను నమ్ముకున్న షారూక్‌ ఖాన్‌

    దాంతో, మహేశ్‌ భట్‌ కుటుంబ సభ్యులపై విమర్శల తాకిడి ఎక్కువైంది. ముఖ్యంగా అతని కూతురు ఆలియా భట్‌ను టార్గెట్‌ చేస్తున్నారు. ఆమె చేస్తున్న సినిమాలపై దుమ్మెత్తిపోస్తూ సోషల్‌ మీడియాలో నెగెటెవ్‌ టాక్‌ ఎక్కువైంది. ఆలియా హీరోయిన్‌గా నటించిన సడక్ 2 మూవీ ట్రైలర్ అత్యధిక డిస్‌లైక్స్‌ పొందిన ట్రైలర్‌గా రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆలియా ఓ హీరోయిన్‌గా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై కూడా ప్రభావం పడుతుందన్న అభిప్రాయాలు ఎక్కువయ్యాయి. దాంతో, ఆర్ఆర్ఆర్ నుంచి ఆలియా భట్‌ను తీసేసి, ఆమె ప్లేస్‌లో గ్లోబల్‌ స్టార్ ప్రియాంక చోప్రాను తీసుకున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది.

    Also Read: గుడ్‌న్యూస్‌ చెప్పిన కోహ్లీ.. తల్లి కాబోతున్న అనుష్క

    ఆలియాను ప్రేక్షకులు ఇష్టపడక పోవడం వల్లే ఆర్ఆర్ఆర్ టీమ్‌ ఈ నిర్ణయం తీసుకుందన్న ప్రచారం జరుగుతోంది. తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా ఇది వినిపిస్తోంది. అయితే, ఈ విషయంపై ఆలియా క్లారిటీ ఇచ్చింది. తన టీమ్‌ ద్వారా ఈ వార్తలను ఖండించింది. ఆర్ఆర్ఆర్ లో ఆలియా కొనసాగుతోందని ఆమె టీమ్‌ స్పష్టం చేసింది. ఈ మూవీలో తన పాత్ర కోసం ఆమె కసరత్తులు చేస్తోందని, తెలుగు కూడా నేర్చుకునే పనిలో ఉందని తెలిపింది. ఆలియాకు చెడ్డ పేరు తెచ్చేందుకే కొందరు కావాలనే ఇలాంటి పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని చెప్పింది. అయితే, ఆలియా వైపు నుంచి క్లారిటీ వచ్చినప్పటికీ ఈ విషయంపై చిత్ర బృందం వైపు నుంచి కూడా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. దీనిపై రాజమౌళి స్పందిస్తేనే ఈ పుకార్లకు పుల్‌స్టాప్‌ పడేలా ఉంది.