https://oktelugu.com/

ఆన్ లైన్ విద్య.. అందరికీ ‘పరీక్ష’గా మారనుందా?

ప్రతియేటా జూన్ తొలివారంలోనే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేది. కరోనా కారణంగా రాష్ట్రంలో కొన్నినెలలుగా పాఠశాలలు మూసివేయాల్సి వచ్చింది. అయితే ఎట్టకేలకు ప్రభుత్వం పాఠశాలలను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 1న నుంచి తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో ఆన్ లైన్ క్లాసులు ప్రారంభించనుంది. ఈమేరకు ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్నాయి. Also Read: తెలంగాణలో అవినీతి కథ.. మారుతోందా? రాష్ట్రంలో కరోనా పరిస్థితుల్లో ఆన్ లైన్ విద్యావిధానం సరైనదే అయినప్పటికీ […]

Written By:
  • NARESH
  • , Updated On : August 27, 2020 / 03:45 PM IST
    Follow us on


    ప్రతియేటా జూన్ తొలివారంలోనే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేది. కరోనా కారణంగా రాష్ట్రంలో కొన్నినెలలుగా పాఠశాలలు మూసివేయాల్సి వచ్చింది. అయితే ఎట్టకేలకు ప్రభుత్వం పాఠశాలలను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 1న నుంచి తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో ఆన్ లైన్ క్లాసులు ప్రారంభించనుంది. ఈమేరకు ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్నాయి.

    Also Read: తెలంగాణలో అవినీతి కథ.. మారుతోందా?

    రాష్ట్రంలో కరోనా పరిస్థితుల్లో ఆన్ లైన్ విద్యావిధానం సరైనదే అయినప్పటికీ చాలా సమస్యలు ఎదురుకానున్నాయి. ప్రభుత్వం దూరదర్శన్, టీ-శాట్ ఛానళ్లు, రేడియో ద్వారా విద్యాబోధన చేయాలని భావిస్తోంది. అయితే వీటికోసం పాఠశాలకు కంప్యూటర్లు, ల్యాప్ టాప్ తదితర ఫర్నీచర్ ఉండాల్సిందే. ఇక విద్యార్థులకు స్మార్ట్ ఫోన్ ఉంటేనే ఆన్ లైన్లో పాఠాలు వినే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఏమేరకు కంప్యూటర్ వంటి సదుపాయాలు ఉన్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రుల్లో 40శాతం వరకు స్మార్ట్ ఫోన్స్ లేవని ఉపాధ్యాయుల సర్వేలో తేలిందట. టీవీలు లేదా స్మార్ట్ ఫోన్ సదుపాయంలేని విద్యార్థులు ఇతరుల వద్దకు వెళ్లి పాఠాలు వినాలని సూచిస్తుంది. దీనినే ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

    కరోనా పరిస్థితుల్లో విద్యార్థులను ఇతరుల ఇంటికి పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడంలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఖరీదైన స్మార్ట్ ఫోన్ కొనిచ్చే స్థోమతలేని తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. చాలామంది తల్లిదండ్రులు కేవలం మధ్యాహ్నం భోజనం కోసమే పిల్లలకు స్కూలుకు పంపించేవారు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి వారికి స్మార్ట్ ఫోన్లు, టీవీలు కొనాలంటే ఏమేరకు సాధ్యం అవుతుందో సర్కారే ఆలోచించుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్ వ్యవస్థ సరిగ్గా ఉండదని స్థానికులు చెబుతున్నారు. కేబుల్ నెట్‌వర్క్‌ల్లో, డీటీహెచ్‌లలో దూరదర్శన్, లేదా టీ-శాట్ వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు.

    రాష్ట్రంలో చాలా వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి. ఇప్పటికీ అరకొర సదుపాయాల మధ్యే పాఠశాలలు నడుస్తున్నాయని ఉపాధ్యాయులు అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలావరకు మాములు మొబైల్స్ నే ఎక్కువగా వాడుతున్నారు. కరోనా కారణంగా ప్రజా రవాణాతో ఇబ్బందులు ఏర్పడటంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యాబోధన చేసే ఉపాధ్యాయులకు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. సొంత వెహికల్స్ పై వెళ్లాల్సి రావడంతోపాటు ఎక్కడా కరోనా అంటుకుంటుందనే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఉపాధ్యాయులు సైతం ఆన్ లైన్ విద్య పట్ల వ్యతిరేకత చూపుతున్నారు.

    Also Read: కరోనా.. తెలంగాణలో తిరగబడుతుందా?

    ఒకవేళ ప్రభుత్వం ఆన్ లైన్ విద్యావిధానానికే మొగ్గుచూపితే లక్షలాది మంది విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందనే వాదనలు విన్పిస్తున్నాయి. ప్రస్తుత ఆన్ లైన్ విద్యావిధానం అటూ సర్కారుకు.. ఇటు ఉపాధ్యాయులు.. విద్యార్థులు.. వారి తల్లిదండ్రులందరికీ పెద్ద పరీక్షగా మారడం ఖాయంగా కన్పిస్తోంది. ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలలు ఆన్ లైన్ విధానం ప్రారంభించి ఘోరంగా విఫలమయ్యాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వమే ఆన్ లైన్ విద్యావిధానానికి మొగ్గుచూపాల్సి వచ్చింది. ప్రభుత్వం సైతం ఆన్ లైన్ విద్యావిధానంలో ఫెయిల్ అయితే ప్రభుత్వం ప్రజల్లో అబాసుపాలు కావడం ఖాయంగా కన్పిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సమస్యను ప్రభుత్వం ఎలా అధిగమిస్తుందో వేచి చూడాల్సిందే..!