Homeఎంటర్టైన్మెంట్RRR Movie: తారక్​, చెర్రీలపై అలియాభట్​ కంప్లైంట్​.. తనను పట్టించుకునేవారు కాదని కామెంట్​

RRR Movie: తారక్​, చెర్రీలపై అలియాభట్​ కంప్లైంట్​.. తనను పట్టించుకునేవారు కాదని కామెంట్​

RRR Movie: దేశవ్యాప్తంగా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్​ఆర్​ఆర్​.. ఇటీవలే ట్రైలర్ విడుదల కాగా.. మిలియన్ల వ్యూస్​తో ముందుకు దూసుకెళ్లిపోతోంది. ఈ క్రమంలోనే చిత్రబృందం ప్రమోషన్స్​లో దూకుడుగా పాల్గొంటోంది. నిన్న హైదరాబాద్​లో ప్రెస్​మీట్ పెట్టిన రాజమౌళి.. తాజాగా హైదరాబాద్​లో విలేఖరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్​, రామ్​ చరణ్​తో పాటు అలియాభట్​, అజయ్​దేవగణ్ కూడా వచ్చారు. అలియాకు వేరే సినిమా షూటింగ్ ఉండగా.. వాయిదా వేసుకుని మరి ఆర్​ఆర్​ఆర్ ప్రమోషన్స్​లో హాజరు అయ్యింది. మీడియా ఆడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్తూ.. తెలుగూలోనూ మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

RRR Trailer (Telugu) - NTR, Ram Charan, Ajay Devgn, Alia Bhatt | SS Rajamouli | 25th March 2022

ఎలా ఉన్నారు?.. మీరు బాగున్నారా?.. ఆర్ఆర్​ఆర్ ట్రైలర్​ పగిలిపోయింది.. ముంబయిలో మాకు పిచ్చెక్కిపోయింది అంటూ ట్రైలర్​పై కామెంట్స్ చేసింది. మధ్యలో రాజమౌళి స్పందిస్తూ.. అలియా సంవత్సరం పాటు తెలుగు నేర్చుకుందని.. ఇప్పుడు తనకు బాగా తెలుగు వచ్చని చెప్పారు. కాగా, అలియా మాట్లాడుతూ.. లాక్​డౌన్​లో నేను ట్యూటర్​ నుంచి జూమ్​ కాల్స్​ ద్వారా తెలుగు నేర్చుకున్నా. లాక్​డౌన్​ వల్ల నేను వ్యక్తిగతంగా ఆయనను కలవలేకపోయా.. అంటూనే సెట్స్ లో చెర్రీ, తారక్​ మధ్య ఉన్న బంధం గురంచి చెప్పింది.

తారక్​, చెర్రీ ఎప్పుూ తెలుగులోనే మాట్లాడుకునేవారని.. అది కూడా తను పక్కనున్నప్పుడే కావాలని అలా చేసేవారని చెప్పింది. ఎప్పుడూ అల్లరి చేస్తూ.. సరదాగా ఉండేవారని పేర్కొంది. వారి స్నేహం చాలా గొప్పదని వివరించింది. ఇలా ఎప్పుడూ వారిద్దరే బిజిగా గడిపేవారని.. తనను అసలు పట్టించుకునేవారు కాదని అలియా సరదాగా చెప్పింది. తారక్​, చరణ్​లతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. రాజమౌళి దర్శకత్వం ఓ అద్బుతమని ప్రశంసలు కురిపించింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version