https://oktelugu.com/

Urvashi Rautela: ఇజ్రాయెల్ మాజీ ప్రధానికి భగవద్గీత ప్రదానం చేసిన బాలీవుడ్ నటి ఊర్వశి…

Urvashi Rautela: అందం అభినయంలో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న బ్యూటీ ఊర్వశి రౌతేలా. ఈ అమ్మడు తన అందంతో ఎంతో మంది కుర్రాళ్ళ గుండెలను కొల్లగొట్టింది. ఈ బ్యూటీ సినిమాల తోనే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా మంచి ఫాలోటింగ్ సంపాదించుకుంది. ఊర్వశి బాలీవుడ్ లో “వర్జిన్ భానుప్రియ”, “పాగల్ పంథి”, “సింగ్ సాబ్ ది గ్రేట్” “హేట్ స్టోరీ 4” వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ నటించిన“ఏక్ లడ్కి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 11, 2021 / 01:36 PM IST
    Follow us on

    Urvashi Rautela: అందం అభినయంలో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న బ్యూటీ ఊర్వశి రౌతేలా. ఈ అమ్మడు తన అందంతో ఎంతో మంది కుర్రాళ్ళ గుండెలను కొల్లగొట్టింది. ఈ బ్యూటీ సినిమాల తోనే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా మంచి ఫాలోటింగ్ సంపాదించుకుంది. ఊర్వశి బాలీవుడ్ లో “వర్జిన్ భానుప్రియ”, “పాగల్ పంథి”, “సింగ్ సాబ్ ది గ్రేట్” “హేట్ స్టోరీ 4” వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ నటించిన“ఏక్ లడ్కి భీగి భాగి సి” సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఈ పాట రీసెంట్ గా 13 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది.

    అయితే ఇజ్రాయెల్ లో జరగననున్న మిస్ యూనివర్స్ 2021 పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించబోతోంది ఈ భామ. ఇండియా నుంచి ఈ ఈవెంట్ కు న్యాయనిర్ణేతగా వ్యవహరించిన వారిలో అతి చిన్న వయస్కురాలుగా ఊర్వశి నిలిచారు. 2021 డిసెంబర్ 12న ఇజ్రాయెల్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ తరుణంలో ఇజ్రాయెల్ చేరుకున్న ఊర్వశి రౌతేలాను ఇజ్రాయెల్ మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన ఇంటికి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఊర్వశి ఆయన నివాసంలో బెంజమిన్ తో పాటు ఆయన కుటుంబాన్ని కూడా కలిసి బహుమతిగా భగవద్గీతను అందించారు. అంతే కాదు మాజీ ప్రధానికి ‘సబ్ షాందర్ సబ్ బదియా’ అనే కొన్ని హిందీ పదాలను కూడా నేర్పింది. ఈ వీడియోను ఊర్వశి తన ఇన్స్టా లో పోస్ట్ చేస్తూ “ఇజ్రాయెల్ మాజీ ప్రధాని, ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రధానమంత్రి, తెలివైన బెంజమిన్ నెతన్యాహు కూడా తనను మిస్ యూనివర్స్ ఈవెంట్‌కు ఆహ్వానించారు” అంటూ ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. ఊర్వశి రౌతేలా ‘ఇన్‌స్పెక్టర్ అవినాష్’ చిత్రంలో ఇన్‌స్పెక్టర్ అవినాష్ మిశ్రా నిజ జీవిత భార్య పూనమ్ మిశ్రాగా కనిపించనుంది. ఆమె తెలుగులో “బ్లాక్ రోజ్‌” లో నటించి మెప్పించింది.