https://oktelugu.com/

Bollywood: హల్దీ వేడుక ఫోటోలను అభిమానులతో పంచుకున్న “విక్ట్రీనా” జంట…

Bollywood: బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ విక్కీ కౌశల్‌, కత్రినా కైఫ్‌లు ఒక్కటయ్యారు. ఇటీవల రాజస్థాన్‌లోని సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌ బర్వారాలో విక్ట్రీనా పెళ్లి ఘనంగా జరిగింది. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అతి కొద్ది మంది సినీ ప్రముఖుల మధ్య వీరి పెళ్లి వైభవంగా జరిగింది. కాగా ఈ పెళ్లికి సంబంధించి సంబంధించిన ఏ అప్‌డేట్స్‌ బయటకు రాకుండా విక్ట్రీనా జాగ్రత్తపడ్డారు. నిశ్చితార్థం, పెళ్లి ముహుర్తం, వేడుకలు, హాల్దీ ఫంక్షన్‌, పెళ్లి వరకు ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వకుండా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 11, 2021 / 02:05 PM IST
    Follow us on

    Bollywood: బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ విక్కీ కౌశల్‌, కత్రినా కైఫ్‌లు ఒక్కటయ్యారు. ఇటీవల రాజస్థాన్‌లోని సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌ బర్వారాలో విక్ట్రీనా పెళ్లి ఘనంగా జరిగింది. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అతి కొద్ది మంది సినీ ప్రముఖుల మధ్య వీరి పెళ్లి వైభవంగా జరిగింది. కాగా ఈ పెళ్లికి సంబంధించి సంబంధించిన ఏ అప్‌డేట్స్‌ బయటకు రాకుండా విక్ట్రీనా జాగ్రత్తపడ్డారు. నిశ్చితార్థం, పెళ్లి ముహుర్తం, వేడుకలు, హాల్దీ ఫంక్షన్‌, పెళ్లి వరకు ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వకుండా సీక్రెట్‌గా ఉంచిన ఈ జంట పెళ్లి ఫోటోలను మాత్రం వారే తమ సోషల్ మీడియా అకౌంట్ ల ద్వారా అఫిషియల్ గా పోస్ట్ చేశారు.

    పెళ్లి జరగడానికి ముందు జరిగే సెలబ్రెషన్స్‌ ఏ రేంజ్‌లో ఉంటాయో అందరికీ తెలిసిందే. హల్దీ ఫంక్షన్‌, సంగీత్ వేడుకలను కూడా గ్రాండ్ గానే నిర్వహిస్తారు. ఇంకా సెలబ్రిటీ ల పెళ్లికాబట్టి ఈ కార్యక్రమాల్లో వారు చేసే సందడి మామూలుగా ఉండదు. ఈ మేరకు వారి అభిమానులు కూడా వాటిని చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. కానీ విక్ట్రీనా పెళ్లి వేడుకల్లో ఇవేవి బయటకు రాకపోవడంతో ఈ జంట అభిమానులు ఒకింత నిరాశకు గురయ్యారు. ఈ తరుణంలో తాజాగా తాజాగా వారి హల్ది ఫంక్షన్‌కు సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు ఈ జంట. సోషల్ మీడియా వేదికగా కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ ఈ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. మరోవైపు వారి హనీమూన్​ గురించి సోషల్​మీడియాలో అనేక కథనాలు చక్కర్లు కొడుతునే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం వీరిద్దరు హనీమూన్​ కోసం యూరప్​కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ హల్దీ వేడుక ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.