Alekhya Chitti : గత వారం రోజుల నుండి సోషల్ మీడియా లో అలేఖ్య చిట్టి పికిల్స్(Alekhya Chitti Pickles) ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఇన్ స్టాగ్రామ్(Instagram) లో పచ్చళ్ళ వ్యాపారంతో ఎంతో ప్రసిద్ధి గాంచిన అలేఖ్య చిట్టి పికిల్స్ ఇప్పుడు మూతపడే పరిస్థితి ఏర్పడింది. కారణం ఇక కస్టమర్ పచ్చళ్ళ రేట్స్ ఈ స్థాయిలో ఉన్నాయేంటి అని అడిగినందుకు అతన్ని పచ్చి భూతులు తిడుతూ ఒక ఆడియో రికార్డు ని పంపింది. దీనికి ఆగ్రహించిన కస్టమర్ ఇన్ స్టాగ్రామ్ లోని మీమర్స్ ఈ ఆడియో ని ఇచ్చాడు. దీంతో మీమర్స్ ఈమె పై ఎన్నో మీమ్స్ చేస్తూ, కస్టమర్స్ తో వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరుని మీరే చూడండి అంటూ మండిపడ్డారు. ఇక అక్కడి నుండి ఈ ఆడియో రికార్డు బాగా వైరల్ అవ్వడం, అలేఖ్య చిట్టి అని అందరూ తిట్టడం మొదలు పెట్టారు. తిట్టినందుకు గాను ముగ్గురు అక్కా చెల్లెళ్ళు క్షమాపణలు చెప్తూ వీడియోలు కూడా విడుదల చేశారు.
Also Read : నా అన్వేషణ అన్వేష్ కు వావి వరుసలు లేవా..మరీ ఇంతలా బూతులా?
సోషల్ మీడియా ట్రోల్స్ ని తట్టుకోలేక, నీరసించి కుప్పకూలిపోయిన అలేఖ్య ను కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో చేర్చారు. ప్రస్తుతం ICU లో చికిత్స పొందుతున్న అలేఖ్య చిట్టి ఆరోగ్య పరిస్థితి విషమం గా ఉందని, ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటే డాక్టర్లు ఆమెని వెంటిలేటర్ కి షిఫ్ట్ చేసి, ఆక్సిజెన్ పైప్ ద్వారా శ్వాసని అందిస్తున్నారని చెప్పుకొచ్చింది. దీని పై అలేఖ్య సోదరులు ఇద్దరూ కూడా వీడియోలు విడుదల చేశారు. ‘అలేఖ్య చేసింది ముమ్మాటికీ తప్పే. దానికి ఆమె క్షమాపణలు కూడా చెప్పింది. అయినప్పటికీ కూడా సోషల్ మీడియా లో ట్రోల్స్ ఆగడం లేదు. అలేఖ్య చేసిన తప్పు కంటే పెద్ద శిక్ష నే పడింది. దయచేసి ఇక మమ్మల్ని వదిలేయండి. ఎలాంటి తప్పుకి అయినా క్షమాపణ ఉంటుంది, పెద్ద మనసు చేసుకొని క్షమించండి’.
‘కొన్ని యూట్యూబ్ చానెల్స్, మీమర్స్ ఇప్పటికీ మా ఫోటోలను ఉపయోగించి మాపై వీడియోలు చేస్తున్నారు. మా అమ్మాయి మాట్లాడిన ఒక్క మాటకు మా జీవితాలు తలక్రిందులు అయ్యింది. పచ్చళ్ళ వ్యాపారాన్ని ఆపేసాము, యూట్యూబ్ ఛానల్ కూడా మాకొద్దు. మాకు కావాల్సింది ప్రశాంతత, దయచేసి ఇక మమ్మల్ని వదిలేయండి ప్లీజ్. మా చెల్లి పొగరుగా క్షమాపణలు చెప్పిందని అంటున్నారు. ఇక ఎలా చెప్పాలండి, ఎన్ని సార్లు క్షమాపణలు చెప్పాలండీ?, అది కూడా సరిపోదు అంటే ఇక ఏమి చెయ్యాలో మీరే చెప్పండి, చనిపోవడం తప్ప మాకు వేరే ఛాయస్ లేదు. ఎలాంటి సహకారం లేకుండా ఆడపిల్లలు అయినప్పటికీ కూడా ఈ వ్యాపారం లో అడుగుపెట్టి మా కష్టార్జీతం తో బ్రతికాము. ఇకనైనా మమ్మల్ని వదిలేయండి ప్లీజ్’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
Also Read : అంతలా తిట్టడం ఎందుకు.. ఇప్పుడు ఆ శోకం ఏంటి ‘అలేఖ్యచిట్టి’
"ALEKYA CHITTI HOSPITALISED AYYINDI ANTA"
Ika Vadileyandi ra papam iga
Simple suggestion for Alekya, assalu meeru social media ki dooram unte antha set Avutundi pic.twitter.com/mHf95GySZO— MawaNuvvuThopu (@MawaNuvvuThopu) April 7, 2025