Anvesh and Alekhya chitti : ఇటీవల అతడు తన యూట్యూబ్ ఛానల్ లో పత్తి గింజలు అనే ప్రోగ్రాం మొదలుపెట్టాడు. మొదట్లో దీనికి ఆదరణ బాగానే ఉండేది. ఎందుకంటే సామాజిక మాధ్యమాలలో విపరీతమైన పాపులారిటీ ఉన్న వ్యక్తులు ఆమధ్య బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ వర్క్ చేశారు. దానికి ప్రతిఫలంగా భారీగానే డబ్బులు సంపాదించారు. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతోమంది యువకులు ప్రాణాలు తీసుకున్నారు. అప్పలపాలై జీవితాలను సర్వనాశనం చేసుకున్నారు. వాటిపై ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఉక్కు పాదం మోపింది. సామాజిక మాధ్యమాలలో విపరీతమైన పాపులారిటీ ఉన్న వ్యక్తులను.. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నా అన్వేషణ అన్వేష్ సమర్థించాడు. ఇక బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేసిన వారిని ఒక ఆట ఆడుకోవడం మొదలుపెట్టాడు. అందులో సావిత్రక్క అలియాస్ శివజ్యోతి, బయ్యా సన్నీ యాదవ్, ఇమ్రాన్ వంటి వారు ఉన్నారు. తాజాగా అలేఖ్య చిట్టి పికిల్స్ సోదరీమణుల వ్యవహార శైలి ని కూడా నా అన్వేషణ అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్ లో ప్రస్తావించాడు. వారు కూడా బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేశారని ఆరోపించాడు. దీనికి ప్రతిఫలంగా భారీగానే డబ్బులు దండుకున్నారని విమర్శించాడు.
Also Read : ఆ యాంకర్ జల్సాలు చేస్తుంది.. యూట్యూబర్ అన్వేష్ మరొక సంచలనం!
బూతులు బాబాయ్ బూతులు
అయితే సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్స్ అసలు రంగు బయట పెట్టే క్రమంలో.. నా అన్వేషణ అన్వేష్ కట్టుతప్పుతున్నాడు. భాష విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు. బండ బూతులు మాట్లాడుతున్న నేపథ్యంలో.. ఓ ఫాలోవర్ నా అన్వేషణ అన్వేష్ కు ఫోన్ చేశాడు. ” మీ పత్తి గింజల కార్యక్రమంలో అలేఖ్య చిట్టి పికిల్స్ నిర్వహించే వాళ్ళని చెల్లెలు అన్నారు. చివరికి వారిపై కూడా బూతులు మాట్లాడారు. అలా మాట్లాడటం తప్పు కదా” అని ఫోన్లో ఆ వ్యక్తి ప్రశ్నిస్తే.. దానిని నా అన్వేషణ అన్వేష్ సమర్ధించుకున్నాడు. పైగా బూతులు మాట్లాడటం తనకు పేటెంట్ రైట్ లాగా చెప్పుకున్నాడు. అయితే దీనిని ఆ నెటిజన్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇంకేముంది నా అన్వేషణ అన్వేష్ ను నెటిజన్లు ఆడుకోవడం మొదలుపెట్టారు. పత్తి గింజల కార్యక్రమం పేరుతో నువ్వు చేస్తోంది ఇదా అంటూ మండిపడుతున్నారు. వావివరస లేకుండా ఇలా మాట్లాడటం దేనికని ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై నా అన్వేషణ అన్వేష్ ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాల్సి ఉంది. నీతులు చెప్పేటప్పుడు.. ఇలా బూతులు మాట్లాడాల్సిన అవసరం ఏందని.. చెల్లి అని పిలుస్తూనే ఇలా చేయడం ఏంటని నెటిజన్లు నా అన్వేషణ అన్వేష్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : అందువల్లే శివ జ్యోతి కి అంతలా ఆస్తులు.. “నా అన్వేషణ అన్వేష్” సంచలనం..
THE REAL FACE OF NAA ANVESHANA
Ninnu Devudu la chuse subscribers ni intha henam ga chustunda pic.twitter.com/6ydHJbACXM— MawaNuvvuThopu (@MawaNuvvuThopu) April 7, 2025