https://oktelugu.com/

Nagarjuna: విషాదంలో నాగార్జున, ఆయన మరణంతో అక్కినేని ఫ్యామిలీ మూలస్థంభం కోల్పోయిందంటూ ఎమోషనల్ పోస్ట్

కింగ్ నాగార్జున సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యారు. ఓ వ్యక్తి మరణం ఆయన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. అక్కినేని ఫ్యామిలీ మూలస్థంభాన్ని కోల్పోయిందంటూ నాగార్జున రాసుకొచ్చారు.

Written By: , Updated On : February 27, 2025 / 11:22 AM IST
Nagarjuna

Nagarjuna

Follow us on

Nagarjuna: అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికగా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, అక్కినేని నాగేశ్వరరావు వీరాభిమాని మరణం పై సంతాపం ప్రకటించారు. అక్కినేని నాగేశ్వరరావుకు ఎద్దుల అయ్యప్ప రెడ్డి వీరాభిమాని అని సమాచారం. ఏఎన్నార్ తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. తండ్రి ద్వారా ఎద్దుల అయ్యప్ప రెడ్డి అక్కినేని ఫ్యామిలీకి పరిచయం. నాగార్జునకు కూడా అయ్యప్ప రెడ్డితో అనుబంధం ఉంది. అయ్యప్ప రెడ్డి మరణ వార్త తెలుసుకున్న నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

Also Read: మోక్షజ్ఞ విషయంలో బాలయ్య బ్లండర్ మిస్టేక్… అయోమయంలో నందమూరి వారసుడి కెరీర్!

ఎద్దుల అయ్యప్ప రెడ్డి మరణం నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆయన నాన్న ఏఎన్నార్ గారికి వీరాభిమాని. అక్కినేని ఫ్యామిలీకి ఒక మూలస్థంభంలా ఉన్నారు. మా కుటుంబంపై ఆయన చూపించిన ప్రేమ, అభిమానం మరువలేనివి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అని.. నాగార్జున ట్విట్టర్ ఎక్స్ లో రాసుకొచ్చాడు. ఒక అభిమాని మరణం పై నాగార్జున స్పందించారంటే.. ఆయనతో ఆ కుటుంబానికి ఉన్న అనుబంధం ఏమిటో అర్థం అవుతుంది.

అక్కినేని ఫ్యామిలీ అభిమానులు సైతం అయ్యప్ప రెడ్డి మృతిపై సంతాపం ప్రకటిస్తున్నారు. ఇక నాగార్జున సినిమా విషయానికి వస్తే… రజినీకాంత్ హీరోగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న కూలి చిత్రంలో నాగార్జున కీలక రోల్ చేస్తున్నారు. ఆయన పాత్ర చాలా వైలెంట్ అండ్ పవర్ఫుల్ గా ఉంటుందని సమాచారం. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తున్న కుబేర మూవీలో నటిస్తున్నారు. ఇది పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్ అని తెలుస్తుంది.

Also Read: రామ్ చరణ్ తో సక్సెస్ అందుకున్న కూడా ఆ దర్శకుడిని ఎవ్వరూ పట్టించుకోకపోవడానికి కారణం ఏంటి..?