Mokshagna Teja
Mokshagna Teja: నందమూరి తారక రామారావు వారసుల్లో నటులుగా సక్సెస్ అయ్యింది చాలా కొద్ది మందే. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే స్టార్స్ అయ్యారు. ఈ విషయంలో మెగా ఫ్యామిలీ సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంది. చిరంజీవి కుటుంబం నుండి వచ్చిన పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ టాప్ స్టార్స్ లిస్ట్ లో ఉన్నారు. బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ రూపంలో ఆ ఫ్యామిలీ నుండి మరో స్టార్ తెరపైకి వస్తాడని అభిమానులు భావిస్తున్నారు. వారి ఆశలు అడియాశలు అవుతున్నాయి. నిరీక్షణకు తెర పడటం లేదు.
Also Read: 500 కోట్ల మార్క్ ను టచ్ చేయబోతున్న ఛావా…తెలుగు వర్షన్ అందుబాటులోకి వచ్చేది అప్పుడేనా..?
బాలయ్య డై హార్డ్ ఫ్యాన్స్ గత పదేళ్లుగా మోక్షజ్ఞను మోస్తున్నారు. ఆయన జన్మదిన వేడుకలు ప్రత్యేకంగా జరుపుతారు. అభిమానులు నిర్వహించే బర్త్ డే వేడుకల్లో మోక్షజ్ఞ పాల్గొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తే చాలు, స్టార్ అయిపోతాడని ఓ వర్గం బలంగా నమ్ముతుంది. అందుకే వారు బాలయ్యపై ఒత్తిడి తెస్తున్నారు. సాధారణంగా 20-25 ఏళ్ల మధ్యలోనే వారసులు నటులుగా మారుతారు. మోక్షజ్ఞ వయసు ఇప్పుడు థర్టీ ప్లస్. ఇంత ఆలస్యం కావడానికి కారణం.. నటుడు కావడం మోక్షజ్ఞకు ఇష్టం లేదనే వాదన కూడా ఉంది.
మొత్తంగా ఓ రెండేళ్లుగా మోక్షజ్ఞ తీరులో మార్పు వచ్చింది. ఆయన తన శరీరాకృతి మార్చుకున్నాడు. స్లిమ్ అండ్ ఫిట్ గా తయారయ్యారు. బాలయ్య షూటింగ్ సెట్స్ కి వెళ్లడం. నేర్చుకోవడం చేస్తున్నాడు. ఫైనల్లీ అభిమానులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ప్రకటించారు. గత ఏడాది చివర్లో గ్రాండ్ గా పూజా కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. చివరి నిమిషంలో అది ఆగిపోయింది.
మోక్షజ్ఞ-ప్రశాంత్ వర్మ మూవీ ఆగిపోయిందంటూ ప్రచారం మొదలైంది. ఈ పుకార్లు నిజమే అని తాజా సమాచారం. మోక్షజ్ఞ ప్రాజెక్ట్ పక్కన పెట్టిన వర్మ… జై హనుమాన్ తో పాటు ప్రభాస్ తో కొత్త ప్రాజెక్ట్ లైన్లో పెడుతున్నాడట. మోక్షజ్ఞ వయసు రీత్యా ఇది ఊహించని దెబ్బ. మరో కొత్త కథ, దర్శకుడిని సెట్ చేసి.. మూవీ చేయడానికి ఏడాది లేదా రెండేళ్ల సమయం పట్టొచ్చు. బాలయ్య తన సినిమాతో, రాజకీయంగా బిజీగా ఉండి, మోక్షజ్ఞ కెరీర్ పై ఫోకస్ పెట్టలేకపోతున్నాడు. ఆయన ఎంపిక సరిగా లేదు. బాలయ్య మోక్షజ్ఞ విషయంలో బ్లండర్ మిస్టేక్ చేశాడనే వాదన వినిపిస్తుంది.
Also Read: మజాకా ఫస్ట్ డే కలెక్షన్స్… అసలు ఇది ఊహించని పరిణామం! ట్రేడ్ వర్గాలకు షాక్