Ram Charan
Ram Charan : కొంతమంది దర్శకులు స్టార్ హీరోలతో సినిమాలను చేసి స్టార్ స్టేటస్ ని అందుకుంటున్నారు. మరి కొంతమంది దర్శకులు మాత్రం స్టార్ హీరోలతో సినిమాలు చేసి విజయాలను అందుకున్నప్పటికి వారికి సరైన గుర్తింపైతే రావడం లేదు. అలాగే మరో స్టార్ హీరో నుంచి అవకాశాలు కూడా రాకపోవడం గమనార్హం… ఇక ఇదిలా ఉంటే ‘ఏమైంది ఈవేళ'(Emaindi evela) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన సంపత్ నంది (Sampath Nandi) ఆ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో రెండో సినిమాని రామ్ చరణ్ హీరోగా రచ్చ (Rachha) అనే సినిమా చేశాడు. మరి ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. అప్పట్లోనే ఈ సినిమా 50 కోట్ల కలెక్షన్స్ ని వసూలు చేసింది అంటూ ప్రొడ్యూసర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు… ఇక ఇలాంటి నేపథ్యంలోనే ఈ సినిమా తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ కొన్ని వార్తలు కూడా వచ్చాయి. కానీ అది కార్యరూపం దాల్చలేదు…ఆ తర్వాత రవితేజ తో చేసిన ‘బెంగాల్ టైగర్’ (Bengal tiger) సినిమా కూడా యావరేజ్ గా నిలిచింది. ఇక ఆ సినిమా తర్వాత అతనికి ఏ స్టార్ హీరో నుంచే అవకాశాలు రాకపోవడంతో గోపీచంద్ ను హీరోగా పెట్టి ‘గౌతమ్ నంద’ అనే సినిమా చేశాడు.
Also Read : ఢిల్లీ కి రామ్ చరణ్.. ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్ట్.. అసలు ఏమైందంటే!
ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకున్నప్పటికి కమర్షియల్ గా మాత్రం భారీ సక్సెస్ ను సాధించలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత చేసిన ‘సీటీ మార్’ సినిమా యావరేజ్ గా నిలిచింది. అయినప్పటికి ఆయనకు మాత్రం ఎలాంటి గుర్తింపు రాలేదు ఆయన చేసిన సినిమాలన్నీ ఆవరేజ్ గా నిలుస్తున్నాయి కానీ సూపర్ సక్సెస్ ని సాధించలేకపోతున్నాయి.
కారణం ఏదైనా ఎందుకు ఇలాంటి ఒక నాసిరకపు కథలతో సినిమాలను చేసి యావరేజ్ సక్సెస్ లను అందుకుంటున్నాడు. ఆయన కంటే ఇండస్ట్రీకి వెనకాల వచ్చిన సందీప్ రెడ్డి వంగ, అనిల్ రావిపూడి లాంటి దర్శకులు వరుస విజయాలను అందుకుంటున్నారు. స్టార్ హీరోలను డైరెక్ట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు.
సంపత్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 15 సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటివరకు ఒక్కటి కూడా సరైన సక్సెస్ అయితే కొట్టలేకపోయాడు. మరి కారణం ఏదైనా కూడా ఇకమీదట ఆయన చేయబోయే సినిమాలతో వరుస సక్సెస్ లను సాధిస్తేనే ఆయన ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతాడు. లేకపోతే మాత్రం ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయే పరిస్థితి కూడా రావచ్చు…