Homeఎంటర్టైన్మెంట్ANR Marriage Story: ఏఎన్నార్ కి పిల్లను ఇవ్వడానికి ఎవరూ ఇష్టపడలేదా? కారణం తెలిస్తే షాక్...

ANR Marriage Story: ఏఎన్నార్ కి పిల్లను ఇవ్వడానికి ఎవరూ ఇష్టపడలేదా? కారణం తెలిస్తే షాక్ అవుతారు?

ANR Marriage Story: లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు(AKKINENI NAGESWARA RAO)కు పిల్లను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదట. ఆయన కుమారుడు కింగ్ నాగార్జున(NAGARJUNA) ఈ విషయాన్ని ఓ సందర్భంలో వెల్లడించారు. అందుకు కారణం ఏమిటో చూద్దాం.

Also Read: ‘హరిహర వీరమల్లు’ యుఎస్ఏ రివ్యూ… హిట్టా? ఫట్టా?

కన్నుమూసే వరకు కళామతల్లి సేవలో తరించారు ఏఎన్నార్. ఆయన చివరి చిత్రం మనం. ఆ సినిమా కోసం ఆయన ఆసుపత్రి బెడ్ పై ఉండి నటించారని సమాచారం. అక్కినేని హీరోల ఆ చిత్రం భారీ విజయం అందుకుంది. ఏఎన్నార్ కి మనం మూవీతో ఘన నివాళి అందించారు వారసులు. సుదీర్ఘ కాలం సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన అరుదైన నటుల్లో ఏఎన్నారు ఒకరు. 1941 నుండి 2014 వరకు ఏఎన్నార్ ఏడు దశాబ్దాలకు పైగా నటుడిగా కొనసాగారు. సుదీర్ఘ ప్రస్థానంలో ఏఎన్నార్ వందల చిత్రాల్లో నటించారు. అనేక రికార్డులు నెలకొల్పారు. ఎన్టీఆర్-ఏఎన్నార్ తెలుగు సినిమాకు రెండు కళ్లుగా కీర్తించబడ్డారు.

ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఏఎన్నార్ కి పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదట. అందుకే ఆయనకు ఆలస్యంగా వివాహం అయ్యిందట. ఆ రోజుల్లో సినిమా వాళ్ళ మీద జనాల్లో మంచి అభిప్రాయం ఉండేది కాదు. ఈ కారణంగా ఏఎన్నార్ కి ఆలస్యంగా వివాహమైంది. 26 ఏళ్ల వయసులో అన్నపూర్ణను ఏఎన్నార్ పెళ్లి చేసుకున్నారు. ఆ రోజుల్లో 26 ఏళ్ళు అంటే చాలా ఆలస్యం అయినట్లే. తనకు పిల్లను ఇవ్వలేదన్న కసితో ఏఎన్నార్ మిస్టర్ పర్ఫెక్ట్ గా మారాడు అట. చాలా నిబద్ధతగా ఉండేవాడట. పిల్లలను కూడా అంతే క్రమశిక్షణతో పెంచాడట.

అమలను నాగార్జున ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ అమలను వివాహం చేసుకోవడంపై మీ తండ్రి ఏఎన్నార్ రియాక్షన్ ఏమిటని నాగార్జునను అడగ్గా… ఆయన సంతోషంగా లేరు. ఆమె కారణంగానే విడాకులు అయ్యాయని అనుకుంటారని నాన్న అమలను పెళ్లి చేసుకోవడాన్ని ఇష్టపడలేదు. అయితే నా సంతోషం చూశాక ఆయన రియలైజ్ అయ్యారని నాగార్జున అన్నారు. సమాజం ఏమనుకుంటుందో అనే భయంతోనే మొదట అమలను ఏఎన్నార్ అంగీకరించలేదని నాగార్జున చెప్పకనే చెప్పాడు.

Also Read: పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ ఊహించని షాక్.. ఇక వీరమల్లు కష్టమే!

దగ్గుబాటి రామానాయుడు కుమార్తె లక్ష్మిని నాగార్జున వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ళ వైవాహిక బంధం అనంతరం నాగార్జున-లక్ష్మి విడిపోయారు. అప్పటికే వీరికి నాగ చైతన్య పుట్టాడు. 1992లో నాగార్జున హీరోయిన్ అమలను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి అఖిల్ సంతానం. కాగా నాగ చైతన్య గత ఏడాది హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను రెండో వివాహం చేసుకున్నారు. ఆయనకు సమంతతో విడాకులైన సంగతి తెలిసిందే. ఇటీవల అఖిల్ కూడా ఓ ఇంటివాడు అయ్యాడు. వ్యాపారవేత్త కుమార్తె జైనబ్ తో అఖిల్ ఏడడుగులు వేశాడు.

Exit mobile version