Akkineni family legacy: హీరో వారసులు హీరోలు కావడం టాలీవుడ్ లో ఆనవాయితీ. అయితే నాగ చైతన్య మాత్రం తన కొడుకును హీరో చేయడు అట. అబ్బాయి పుడితే అతడి ప్రొఫెషన్ ఇదే అంటూ డిసైడ్ చేసేశాడు.
లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు తెలుగు చలనచిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేశారు. దశాబ్దాల పాటు ఆయన నటప్రస్థానం సాగింది. నాగేశ్వరావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున బడా స్టార్ అయ్యారు. తండ్రి వారసత్వాన్ని నిలబెట్టారు. ఇక నాగార్జున ఇద్దరు కుమారులు నాగ చైతన్య, అఖిల్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. నాగ చైతన్య టైర్ టు హీరోగా నిలదొక్కుకున్నాడు. ఆయన పేరిట కొన్ని సూపర్ హిట్స్ ఉన్నాయి. అఖిల్ కి ఇంకా బ్రేక్ రాలేదు. ఆయన పరిశ్రమకు వచ్చి పదేళ్లు అవుతుంది.
Also Read: మెగాస్టార్ చిరంజీవి ఎత్తుకున్న ఈ బుడ్డోడు ఎవరో గుర్తుపట్టారా..?
అఖిల్ ని నాగార్జున క్రికెటర్ ని చేయాలనుకున్నాడు. ఆస్ట్రేలియాలో శిక్షణ ఇప్పించారు. క్రికెటర్ గా అరంగేట్రం చేయాల్సిన అఖిల్ ని మనసు మార్చుకుని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కాగా నాగ చైతన్య తనకు అబ్బాయి పుడితే తనను ఏం చేయాలి అనుకుంటున్నాడో వెల్లడించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. రేసింగ్ నాకు థెరపీ లాంటిది. నాకు 50 ఏళ్ళు వచ్చే నాటికి ఇద్దరు లేదా ఒకరు సంతానం ఉండాలి. అబ్బాయి పుడితే వాడిని కచ్చితంగా రేసర్ ని చేస్తాను. రేసింగ్ కాంపిటీషన్ లో దించుతాను. కూతురు పుడితే మాత్రం తనకు ఇష్టం వచ్చిన ప్రొఫెషన్ లో ఎంకరేజ్ చేస్తాను.
పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. నేను బాల్యంలో ఎలా ఎంజాయ్ చేశానో అదే విధంగా ఎంజాయ్ చేయాలి… అన్నారు. ఆయన స్టేట్మెంట్ అక్కినేని ఫ్యాన్స్ కి ఒకింత షాక్ అనడంలో సందేహం లేదు. అభిమానులు నట వారసత్వాన్ని గట్టిగా కోరుకుంటారు. తాము అభిమానించే హీరోకి కొడుకు ఉంటే అతడు కూడా హీరో కావాలని ఆశిస్తారు. నాగ చైతన్య తన కొడుకును రేసర్ ని చేస్తాను చెప్పడం ద్వారా వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లాడు.
Also Read: బాలీవుడ్ లో తగ్గని ‘పుష్ప’ మేనియా.. ఈ వీడియోనే ఫ్రూఫ్
నాగ చైతన్య గత ఏడాది చివర్లో హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్ళు రిలేషన్ లో ఉన్న ఈ జంట ఏడడుగులు వేశారు. షూటింగ్స్ వలన శోభితకు సమయం కేటాయించలేకపోతున్నాడట. అందుకే ఇంట్లో ఉంటే ఖచ్చితంగా కలిసి భోజనం చేయాలని నిబంధన పెట్టుకున్నారట. సినిమాలు, షికార్లకు వెళ్లినా ఆ సమయాన్ని ప్రత్యేకంగా మార్చుకోవాలని అనుకున్నారట. సమంతకు 2021లో విడాకులు ఇచ్చిన నాగ చైతన్య రెండో వివాహంగా శోభితను చేసుకున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య NC 24 లో నటిస్తున్నారు.