Pushpa 2 Movie Craze: ఒక సినిమా క్రియేట్ చేసిన హిస్టరీ అనేది చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో ఉండిపోతుంది. ఇక కలెక్షన్స్ పరంగానే కాకుండా ఆ సినిమా చేసిన మ్యాజిక్ కూడా జనాల్లో చాలాకాలం పాటు అలాగే నిలిచిపోతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా వచ్చిన పుష్ప (Pushpa) సినిమా మేనియా అనేది జనాల్లో ఇప్పటికీ కొనసాగుతోంది. పుష్ప 2 సినిమాతో గత సంవత్సరం పెను ప్రాంభంజనాన్ని సృష్టించిన అల్లు అర్జున్ 1850 కోట్లకు పైన కలెక్షన్లు కొల్లగొట్టాడు…ఇక బాలీవుడ్ లో ఈ సినిమాకి చాలా మంచి ఆదరణ దక్కింది. బాలీవుడ్ ప్రేక్షకులందరు పుష్ప సినిమాను చూసి వల్ల సొంత సినిమాగా ఆదరించారు. ఇక దాంతోపాటుగా అల్లు అర్జున్ ను తమ అభిమాన హీరోగా మార్చుకున్నారు. పుష్ప 2 గెటప్ లు వేసుకుంటూ మరి ఆ సినిమాకి భారీ ప్రమోషన్స్ ని కూడా నిర్వహించారు. మొత్తానికైతే పుష్ప 2 సినిమా వచ్చి 8 నెలలు గడుస్తున్నప్పటికి ఇప్పటికీ బాలీవుడ్లో పుష్ప మేనియా నడుస్తోందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక కండల వీరుడి గా మంచి గుర్తింపు సంపాదించుకున్న జాన్ అబ్రహం సైతం పుష్ప ఫ్యాన్ ను తన ఇంటికి పిలిపించుకొని పుష్ప మేనరిజమ్స్ చేయించుకుని మరి సంతోషపడుతున్నాడు అంటే పుష్ప ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు…
Also Read: పవన్ బిజీలో.. ‘ఓజీ’ కోసం సుజిత్ కష్టాలు మామూలుగా లేవు…
ఈ సినిమాతో ఓవర్ నైట్ లో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగడమే కాకుండా ఇండియన్ సినిమా బాక్సాఫీస్ ని కొల్లగొట్టిన హీరోగా మంచి కీర్తి ప్రతిష్టలను అందుకున్నాడు… నిజానికి ఒక్క సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని శాసించే స్థాయికి ఎదిగాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు పసిగట్టలేరు అనడానికి పుష్ప 2 సినిమాని ఒక మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరి ఏది ఏమైనా కూడా పుష్ప సినిమా నుంచి వచ్చిన రెండు పాటలు కూడా అద్భుతమైన విజయాన్ని సాధించి అల్లు అర్జున్ కెరియర్ ను మార్చేశాయి. సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ సైతం ఈ సినిమాతో పాన్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు…
Also Read: మహేష్ బాబు – రాజమౌళి సినిమాలో ఆ ఒక్కటి మిస్ అవ్వబోతుందా..?
ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ కూడా వాళ్ళ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇక తొందరలోనే పుష్ప 3 సినిమాని కూడా పట్టాలెక్కించే ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వస్తుంది అనే విషయం మీద ఇంకా క్లారిటీ అయితే లేదు. కానీ మొత్తానికైతే సుకుమార్ ఈ