Akkada Ammayi Ikkada Abbayi Review: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతున్న క్రమంలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక ప్రదీప్ మాచిరాజు లాంటి యాంకర్ సైతం హీరోగా మారి సినిమాలను చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇంతకు ముందు ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే ఒక సినిమా చేసి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు…ఇప్పుడు ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను మెప్పించిందా? లేదా…ఇక మీదట ప్రదీప్ మాచిరాజు హీరోగా కంటిన్యూ అవ్వచ్చా లేదంటే మళ్ళీ యాంకరింగ్ కి పరిమితం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందా?అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Also Read: సౌత్ లో యువరాణి పాత్రల్లో మెప్పించిన హీరోయిన్స్ వీళ్ళే!
కథ
ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక పల్లెటూరులో రాజకుమారి (దీపిక పిల్లి) అనే అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయి పుట్టినప్పటి నుంచి ఆ ఊర్లో అందరికి అదృష్టం కలిసి వస్తుంది. మొత్తానికైతే కష్టాల్లో ఉన్న ఊరు తన గొప్ప స్థాయికి ఎదుగుతుంది. ఇక ఈ అమ్మాయి పెళ్లి చేసుకొని వేరే ఊరు వెళ్ళిపోతే వాళ్ళకు మళ్లీ దరిద్రం వస్తుందనే ఉద్దేశ్యంతో ఆమె కంటే పెద్దవారైనా 60 మంది అబ్బాయిల్లో ఎవర్నో ఒకరిని ఆమె ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనే రూల్ పెడతారు. దానికి ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ కూడా ఓకే చెప్తాడు. 20 మంది చిన్నప్పటి నుంచి ఆమెను ఇంప్రెస్ చేయడానికి చాలా రకాల ప్రయత్నాలైతే చేస్తూ ఉంటారు.
అయితే ఈ ఊరికి పనిమీద ఇంజనీర్ కృష్ణ (Pradeep Machiraju) వస్తాడు. కృష్ణ రాజకుమారిని చూసి ప్రేమిస్తాడు. ఫైనల్ గా వీళ్లిద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు. ఇక కృష్ణ ఈ ఊర్లో ఉన్న కట్టుబాట్లను బ్రేక్ చేసి మరి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? లేదంటే ఊరు కట్టుబాట్లకు అంగీకరించి తన ప్రేమను వదిలేసి వెళ్ళిపోతాడా? అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే నితిన్ భరత్ అనే ఇద్దరు జబర్దస్త్ షో కి డైరెక్టర్లుగా వ్యవహరించారు. ఇక తెలుగులో ఆ షో కి విపరీతమైన ఆదరణ దక్కడమే కాకుండా ఒకానొక టైమ్ లో హైయెస్ట్ టీఆర్పి రేటింగ్ ను సైతం సంపాదించుకొని టెలివిజన్ షో లోనే ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది… ఇక వీళ్లిద్దరూ దర్శకులుగా మారి చేసిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా సగటు ప్రేక్షకుడిని మెప్పించే విధంగా ఉందనే చెప్పాలి. మొదటి నుంచి చివరి వరకు సినిమాని చాలా ఎంగేజింగ్ నడిపించే ప్రయత్నం అయితే చేశారు.
ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో సినిమాని బాగా ఎంటర్ టైనింగ్ గా తీసుకెళ్లిన దర్శకుడు సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి మాత్రం రొటీన్ టెంప్లెట్ లోనే సినిమాను ముగించే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ లో గెటప్ శ్రీను, సత్యల కామెడీ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంది. అలాగే ఇందులో ఒక ఇంటెన్స్ డ్రామా కూడా రన్ అవుతూ ఉంటుంది. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి వీళ్లిద్దరూ ప్రేమను ఎలా గెలుస్తారు అనే సన్నివేశాలను చాలా క్యూరియాసిటితో తెరకెక్కిస్తారు అని అనుకున్నప్పటికి ఒక రొటీన్ ఫార్ములాలో సినిమాను ముందుకు తీసుకెళ్లి ఎలాంటి హైపు లేకుండా క్లైమాక్స్ ముగించేశారు.
దీనివల్ల సెకండ్ హాఫ్ ప్రేక్షకుడికి పెద్దగా నచ్చదు ఫస్టాఫ్ ఉన్న రేంజ్ లో సెకండ్ హాఫ్ కనక ఉన్నట్లయితే సినిమా మంచి విజయాన్ని సాధించేది… ఇక నితిన్ భరత్ లు మొదటి సినిమా అయినా కూడా ఎక్కడ తడబడకుండా సినిమాలో ఉన్న ఇంటెన్స్ డ్రామాని పండించడానికి ప్రయత్నం అయితే చేశారు. ఇక కామెడీని పండించడంలో కూడా వాళ్లు చాలా వరకు సక్సెస్ అయ్యారు…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టులు పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో ప్రదీప్ మాచిరాజు ఒక సెటిల్డ్ పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు. ఇంజనీర్ గా ఆయన చేసిన పర్ఫామెన్స్ సినిమాకి చాలా బాగా హెల్ప్ అయింది. మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన ఖాతాలో మరొక సక్సెస్ అయితే చేరింది. మరి ఇకమీదట ఆయన వరుసగా సినిమాలు చేసిన కూడా తనకు మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది… ఇక టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయ్యి ఆ తర్వాత యాంకర్ గా మారిన దీపిక పిల్లి కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా చాలా మంచి పర్ఫామెన్స్ అయితే ఇచ్చింది. తనకి కూడా ఇకమీదట చాలా మంచి ఫ్యూచర్ అయితే ఉంది.
ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ కథలో చేస్తూ ఒక ట్రెడిషనల్ పాత్రలను చేస్తూ ముందుకు వెళ్తే ఆమెకు చాలా మంచి లైఫ్ ఉంటుంది. అలా కాకుండా మోడ్రన్ డ్రెస్ లు వేసుకుంటూ సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగితే మాత్రం చాలా కష్టం అవుతుంది…గెటప్ శ్రీను సినిమా మొత్తం మెల్ల కన్ను తో నటించి మెప్పించాడు…సత్య కూడా తన కామెడీతో ప్రేక్షకులను అలరించాడు…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి రాధన్ అందించిన మ్యూజిక్ అద్భుతంగా ఉంది…రెండు పాటలు కూడా బాగున్నాయి..ఇక సినిమాటోగ్రాఫర్ అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా సాంగ్స్ కి పిక్చరైజేషన్ చాలా బాగా సెట్ అయింది. ఇక సినిమాలోని మూడ్ చెడిపోకుండా మంచి విజువల్స్ అయితే అందించారు…ఇక ఎడిటర్ కూడా తన వర్క్ ను చాలా బాగా చేశారు… షార్ప్ ఎడిట్ చేసి సినిమాను లాగ్ అవ్వకుండా చూసుకున్నారు…
ప్లస్ పాయింట్స్
కథ
ప్రదీప్, గెటప్ శ్రీను, సత్య యాక్టింగ్
ఫస్ట్ హాఫ్
మైనస్ పాయింట్స్
సెకండ్ హాఫ్
కొన్ని సీన్లు స్లో అయ్యాయి…
రేటింగ్
ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ 2.5/5