Tollywood Heroines: సినిమాల్లో నటీనటులకు మోస్ట్ ఛాలెంజింగ్ రోల్స్ ఏమిటి అని అడిగితే నెగటివ్ రోల్ లో నటించడం, లేదా వేరే విభిన్నమైన క్యారక్టర్ చేయడం వంటివి చెప్తుంటారు. కానీ అంతకు మించిన ఛాలెంజింగ్ రోల్ ఏదైనా ఉందా అంటే రాజు/రాణి క్యారెక్టర్స్ చేయడమే. ఈ పాత్రలు అందరికీ సరిపోయేవి కావు. కొంతమంది తమకు సూట్ కాకపోయినా ఇలాంటి రోల్స్ వేసి నవ్వులపాలైన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ రాణి/యువరాణి క్యారెక్టర్స్ చేసి ఆడియన్స్ వద్ద డిస్టింక్షన్ లో మార్కులు కొట్టిన హీరోయిన్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం.
Also Read: బ్రహ్మముడి విలన్ రుద్రాణి అత్త అందాల అరాచకం
అనుష్క(Anushka Shetty):
మహారాణి క్యారక్టర్ అంటే మన అందరికీ గుర్తుకొచ్చే మొట్టమొదటి పేరు అనుష్క. ఆమె చూపులోని రాజసం, ఆమె మాట్లాడే తీరు, ఆమె సౌందర్యం, ఇలా ఒక రాణికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఆమెలో ఉన్నాయి. అందుకే ఆమె ఇప్పటి వరకు అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి వంటి సినిమాల్లో వరుసగా మహారాణి క్యారెక్టర్స్ చేసి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.
కాజల్ అగర్వాల్(Kajal Aggarwal):
కెరీర్ ప్రారంభం నుండి పక్కింటి అమ్మాయి పాత్రలు చేసుకుంటూ వచ్చిన కాజల్ అగర్వాల్, ‘మగధీర’ చిత్రంలో మిత్రవిందదేవి గా ఎంత అద్భుతంగా నటించిందో మన అందరికీ తెలిసిందే. బహుశా ఆరోజుల్లో యువరాణులు ఇంతే అందంగా ఉండేవారేమో అని అనిపించేలా వెండితెర పై మెరిసిపోయింది కాజల్ అగర్వాల్.
మృణాల్ ఠాకూర్(Mrunal Thakur):
ఈమె ‘సీతారామం’ చిత్రం లో నూర్ జహాన్ అనే రాణి క్యారక్టర్ లో నటించింది. రాణి లాగ ఆభరణాలు ధరించి వెండితెర పై కనిపించలేదు కానీ, రాణి తాలూకూ గుణాలను మాత్రం తన హావభావాలతో అద్భుతంగా పలికించి ఆడియన్స్ నుండి మార్కులు కొట్టేసింది.
శ్రీయ శరన్(Shriya Saran):
ఈమె అందం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. నాలుగు పదుల వయస్సులో కూడా ఈమె నేటి తరం కుర్ర హీరోయిన్స్ కి పోటీ ని ఇస్తుంది. ఈమె కూడా మహారాణి క్యారక్టర్ లో అద్భుతంగా రాణించింది. గతంలో ఈమె నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘గౌతమ్ పుత్ర శాతకర్ణి’ చిత్రంలో మహారాణి క్యారక్టర్ చేసింది.
త్రిష కృష్ణన్(Trisha Krishnan):
ఐశ్వర్య రాయ్ ని డామినేట్ చేసే హీరోయిన్ ఇప్పటి వరకు ఇండస్ట్రీ లో ఎవ్వరూ లేరు, భవిష్యత్తులో కూడా రాబోరు అని అంతా అనుకునేవారు. కానీ త్రిష కృష్ణన్ ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రం లో శత్రువుల ఎత్తులకు పై ఎత్తులు వేసే కుంధవై అనే యువరాణి పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో ఆమె కొన్ని సన్నివేశాల్లో ఐశ్వర్య రాయ్ ని సైతం స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో డామినేట్ చేయడం గమనార్హం.
శోభిత ధూళిపాళ్ల(Sobhita Dhulipala):
పొన్నియన్ సెల్వన్ చిత్రం లో వనతి అనే యువరాణి క్యారక్టర్ లో శోభిత ధూళిపాళ్ల అద్భుతంగా నటించి ఆడియన్స్ వద్ద మార్కులు కొట్టేసింది. ఎంతో సహజమైన నటనతో ఈ తెలుగు అమ్మాయి నటించిన తీరు భవిష్యత్తులో కుర్ర హీరోయిన్స్ కి మార్గదర్శకం గా నిలవొచ్చు.
Also Read: ‘బిగ్ బాస్ 9’ ఆఫర్ పై క్లారిటీ ఇచ్చిన అలేఖ్య చిట్టి..వీడియో వైరల్!