Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) తో పనిచేయాలని ప్రతీ డైరెక్టర్ కి ఉంటుంది. ఎందుకంటే డైరెక్టర్స్ విజన్ కి మించి అద్భుతంగా నటించగల నటుడు మహేష్ బాబు. అతిశయం లేకుండా చాలా సహజంగా నటించడం మహేష్ బాబు స్పెషాలిటీ. ప్రస్తుతం ఆయన రాజమౌళి(SS Rajamouli) తో ఒక సినిమా చేస్తున్నాడు. సోలో గా ఇండస్ట్రీ లో ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన మహేష్ బాబు, దేశం గర్వించదగ్గ సినిమాలను అందించిన రాజమౌళి లాంటి దర్శకుడితో చేతులు కలిపితే బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ అవుతాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ వండర్స్ కోసం 2027వ సంవత్సరం వరకు ఎదురు చూడాలి. అయితే మహేష్ బాబు గురించి ప్రముఖ నటుడు , దర్శకుడు బండి సరోజ్ కుమార్(Bandi Saroj Kumar) రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారాయి.
Also Read: సౌత్ లో యువరాణి పాత్రల్లో మెప్పించిన హీరోయిన్స్ వీళ్ళే!
ఆయన మాట్లాడుతూ ‘ఈమధ్య కాలంలో మహేష్ బాబు సత్తా కి తగ్గ సినిమాలు రావడం లేదు. అన్నీ ఒకే తరహా పాత్రలు చేస్తూ ఆడియన్స్ కి మాత్రమే కాదు, అభిమానులకు కూడా బోర్ కొట్టేస్తున్నాడు మహేష్ బాబు. నాకే అతనితో దర్శకత్వం చేసే అవకాశం వస్తే, ఆయనతో శవాల పక్కన డ్యాన్స్ వెయ్యిస్తా. దేశం లో ఇప్పటి వరకు ఏ నటుడు కూడా చెయ్యని క్యారక్టర్ ని ఆయనతో చేయిస్తా. మహేష్ సత్తా ఇది, ఈ స్థాయిలో ఆయన నటించగలడు అని మరోసారి అందరికీ అర్థం అయ్యేలా చేస్తాను’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. బండి సరోజ్ కుమార్ పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు. అదే విధంగా ఈయన దర్శకుడిగా ‘మాంగల్యం’, ‘నిర్బంధం’ వంటి యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ చేశాడు. ఇవి ఎంత పెద్ద హిట్ అయ్యాయో మన అందరికీ తెలిసిందే.
ఇదంతా పక్కన పెడితే మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ షూటింగ్ ఒడిశా లో జరిగిన సంగతి మన అందరికీ తెలిసిందే. రెండవ షెడ్యూల్ మొదలు అయ్యే ముందు చిన్న బ్రేక్ దొరకడం తో మహేష్ తన కూతురు సితార తో కలిసి రోమ్ దేశ పర్యటనకు వెళ్ళాడు. ఇండియా కి తిరిగి రాగానే ఆయన రెండవ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు. ఇక నుండి షెడ్యూల్స్ మధ్య ఎలాంటి గ్యాప్ ఉండవట. నాన్ స్టాప్ గా షెడ్యూల్స్ జరుగుతూనే ఉంటాయని అంటున్నారు. హైదరాబాద్ లో ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ చిత్రానికి సంబంధించిన ఒక భారీ సెట్టింగ్స్ ని ఏర్పాటు చేసారు. ఈ చిత్రం లో ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ వంటి టాప్ స్టార్స్ నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలను రాజమౌళి ప్రెస్ మీట్ ద్వారా అధికారికంగా తెలియజేయనున్నాడు.