Akira Kurosawa: సినిమాకి స్క్రీన్ ప్లే అంటే ప్రాణం. మరి స్క్రీన్‌ప్లే ఎలా ఉండాలి ? అని ప్రపంచం మొత్తం మీద వందల పుస్తకాలు ఉండి ఉంటాయి. కానీ, స్క్రీన్ ప్లే అంటే ఏమిటో ఎవరికీ క్లారిటీ లేదు. కారణం.. స్క్రీన్ ప్లేకి హార్డ్ అండ్ బౌండ్ రూల్స్ లేవు. ఎంత అద్భుతమైన కథ అయినా దానికి ఎలాంటి స్క్రీన్ ప్లే రాయాలో ఎవ్వరూ చెప్పలేరు. ఎవరైనా ఎంత గొప్ప మంచి రచయిత కావొచ్చు.

మరి ఆ రచయిత రాసిన రచనకు ఉండాల్సిన ప్రాధమిక లక్షణం ఇన్‌స్టింక్ట్. అయితే, కథను బట్టే కథనం వస్తోంది. ఏ రచయిత అయినా, తాను చెప్పాల్సిన కథలు ఉన్నాయి, ఆ కథలు చెప్పటానికి కావాల్సిన వాయిస్ అతని దగ్గర ఉందని బలంగా అనుకున్నప్పుడే ఆ రచయిత కథ రాయగలడు. అయితే, ఆ కథను ఎలా చెప్పాలి అనే విశ్లేషణ మొదలవుతుంది.
Also Read: మరపురాని మేటి నటుడు అచ్యుత్
చూసే ప్రతి సంఘటనని, అనుభవాన్ని కథగా చెప్పాలనే ఆలోచన కలుగుతుంది. ఉదాహరణకు అకిరా కురసోవా రోజుకి కనీసం ఒక్క పేజ్ అయినా వ్రాయండి అని రచయితలకి ఒక సలహా ఇచ్చాడు. రోజూ వ్రాస్తూ ఉండండి ఆ సాధనే కథలను ముందుకు తీసుకుని వెళ్తుంది అని ఆయన ఉద్దేశ్యం. అలాగే మంచి సాహిత్యం చదవాలి.
కాకపోతే, ఇన్‌స్పైర్ అవ్వటానికో, కాపీ చెయ్యటానికో కాదు ఆలోచనా పరిధి పెంచుకోవటానికి. ఆలోచనల్లో లోతు పెరగడానికి. అదే విధంగా ప్రపంచాన్ని చూడాలి. ప్రపంచం మొత్తం మీద మనుషులు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ సమస్యలు, వాళ్ళ సంస్కృతి మీద అవగాహన పెంచుకోవాలి.
Also Read: ఘనంగా నిశ్చితార్థం చేసుకున్న ఇండియన్ ఐడల్ విన్నర్ రేవంత్.. ఫోటోలు వైరల్!