Singer Revanth Engagement: ఘనంగా నిశ్చితార్థం చేసుకున్న ఇండియన్ ఐడల్ విన్నర్ రేవంత్.. ఫోటోలు వైరల్!
Singer Revanth Engagement: సూపర్ సింగర్ 5, 2010వ సంవత్సరంలో మొదలైన ఆయన ప్రస్థానం ప్లే బ్యాక్ సింగర్ గా తనకు ఎంతో మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఇలా ఎన్నో అద్భుతమైన పాటలని పాడి ఎన్నో అవార్డులను దక్కించుకుని ఇండియన్ ఐడల్ 9 విజేతగా నిలబడి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింగర్ లొల్ల వెంకట రేవంత్ కుమార్ శర్మ అలియాస్ రేవంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.రేవంత్ ప్లేబ్యాక్ సింగర్ గా తెలుగు, కన్నడ భాషల్లో […]

Singer Revanth Engagement: సూపర్ సింగర్ 5, 2010వ సంవత్సరంలో మొదలైన ఆయన ప్రస్థానం ప్లే బ్యాక్ సింగర్ గా తనకు ఎంతో మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఇలా ఎన్నో అద్భుతమైన పాటలని పాడి ఎన్నో అవార్డులను దక్కించుకుని ఇండియన్ ఐడల్ 9 విజేతగా నిలబడి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింగర్ లొల్ల వెంకట రేవంత్ కుమార్ శర్మ అలియాస్ రేవంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.రేవంత్ ప్లేబ్యాక్ సింగర్ గా తెలుగు, కన్నడ భాషల్లో సుమారు 200కు పైగా చిత్రాలలో పాటలు పాడి మంచి గుర్తింపు సంపాదించుకున్న రేవంత్ డిసెంబర్ 24వ తేదీ జరుపుకున్నారు.
ఈ క్రమంలోనే రేవంత్ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త క్షణాలలో వైరల్ గా మారాయి. ఇండియన్ ఐడల్ 9 విజేతగా గెలిచిన రేవంత్ బాహుబలి ది బిగినింగ్ సినిమాలో “మనోహరి” అనే పాట పాడారు. ఈ పాటకుగాను ఈయనకి IIFA ఉత్సవాలలో భాగంగా ఉత్తమ నేపథ్య గాయకుడుగా స్టార్ మా మ్యూజిక్ అవార్డును సొంతం చేసుకున్నారు.
View this post on Instagram
ఈ విధంగా ప్లేబ్యాక్ సింగర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న రేవంత్ అన్విత అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. అయితే ఆ అమ్మాయి ఎవరు? ఏంటి? అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఇక ప్రస్తుతం ఈయన నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పెద్దఎత్తున నెటిజన్లు ఇతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
