తెలుగు టివి మెగాస్టార్ అచ్యుత్ 20 వ వర్ధంతి నేడు.
చక్కని నటనతో ఇంటింటి పేరైన అచ్యుత్(Kunapareddy Achyutha Vara Prasad) గుర్తుగా ఇన్నాళ్లు టివి పరిశ్రమ ఎలాంటి కార్యక్రమం నిర్వహించక పోవడం పట్ల ఆ రంగంలో వారే చెవులు కొరుక్కుంటున్నారు. అచ్యుత్ చనిపోయి రెండు దశాబ్దాలైనా వీక్షకులు ఆయనను ఇంకా మరచిపోకపోవడం విశేషం. చిన్న వయసులో గుండెపోటుతో మరణించిన అచ్యుత్ తన నటన కు అయిదు నంది అవార్డులు పొందారు.
ఈటివి లో అచ్యుత్ నటించిన అంతరంగాలు, అనుబంధం, అన్వేషిత ధారావాహికలు సంచలన విజయాలుగా నిలిచాయి.
చిరంజీవి తో డాడీ, బావగారు బాగున్నారా, హిట్లర్
పవన్ కళ్యాణ్ తో తొలిప్రేమ, తమ్ముడు, గోకులంలో సీత మున్నగు విజయవంతమైన చిత్రాల్లో నటించారు.
తాజమహల్, లాహిరి లాహిరి లాహిరిలో, ఎదురులేని మనిషి, కౌరవుడు, జీవనవేదం, స్వాతి కిరణం, ప్రేమ ఎంత మధురం ఆయనకు తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేశాయి. ఇక టివిలో అచ్యుత్ తిరుగులేని నటుడిగా వెలిగారు.
ఇంధ్ర ధనస్సు తొలి దూరదర్శన్ సీరియల్ కాగా వెన్నెల వేట, హిమబిందు, ప్రేమ అంటే ఇదే, మిస్టర్ బ్రహ్మానందం, ఇదెక్కడైనా ఉందా, స్వయంవరం సీరియళ్ళలో నటించారు. మా టివిలో మొదటిసారిగా అక్కినేని నాగేశ్వర రావు ముఖ్య పాత్రలో మట్టిమనిషి సీరియల్ నిర్మించారు. కాదంబరి కిరణ్, ప్రదీప్ లతో కలసి ఈ సీరియల్ నిర్మించారు. హీరో కృష్ణ ను బుల్లితెరకు పరిచయం చేస్తూ నామన రామదాస్ నాయుడు నిర్మించిన అన్నయ్య సీరియల్ లో నిర్మాతగా, నటుడిగా వ్యవహరించారు.
టివి ఆర్టిస్టుల సంఘం వ్యవస్థాపక అధ్యక్ష్యుడుగా వ్యవరించారు.