Akhil Akkineni: అక్కినేని అఖిల్ హీరో గా నటించిన ‘లెనిన్’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండి మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. టాక్ కి తగ్గట్టుగానే ఈ చిత్రానికి అనకాపల్లి నుండి అమెరికా వరకు బంపర్ ఓపెనింగ్ వచ్చింది. అక్కినేని ఫ్యాన్స్ ఈ ఓపెనింగ్ ని చూసి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ రేంజ్ లో టాక్ వస్తుందని అసలు ఊహించలేదని , అఖిల్ ఎట్టకేలకు కుంభస్థలం బద్దలు కొట్టాడని అంటూ అభిమానులు సంతోషం తో చిందులు వేస్తున్నారు. ఇక అఖిల్ నిన్న కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ లో తీవ్రమైన భావోద్వేగానికి గురై తన తండ్రి అక్కినేని నాగార్జున ని గట్టిగా పట్టుకొని ఏడవడం హైలైట్ అయ్యింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది. ఎక్కడ చూసినా ఇప్పుడు దీని గురించే చర్చ.
ఇకపోతే అక్కినేని అఖిల్ ప్రతీ సినిమాకు ఒక అభిమాని బాగా ఫోకస్ అవుతూ ఉంటారు. ‘అయ్యగారే నెంబర్ 1’ అంటూ ఈ అభిమాని చేసే హంగామాని అంత తేలికగా ఎవరైనా మర్చిపోగలరా చెప్పండి?. అఖిల్ కి కూడా ee అభిమాని బాగా సుపరిచితమే. ఒకసారి ఆయన ఈ వీడియో ని చూసి కచ్చితంగా కలుస్తానని కూడా చెప్పారు. కానీ మామూలుగా కలవను , భారీ హిట్ కొట్టిన తర్వాతే కలుస్తాను , అతనితో కలిసి సెలబ్రేషన్స్ చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చారు అఖిల్. ‘లెనిన్’ చిత్రం ఇప్పుడు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు అఖిల్ తన వీరాభిమానిని కలిసేందుకు సిద్ధం అవుతున్నారు. అందుకు సంబంధించిన విజువల్స్ త్వరలోనే బయటకు రానున్నాయి. ఒక అభిమాని కోసం హీరో స్వయంగా రావడం కొన్ని సందర్భాల్లోనే చూసాం. ఇప్పుడు మరోసారి అలాంటి సందర్భం క్రియేట్ అవ్వనుంది.
ఇక ఆ అభిమానికి ఇంతకు మించిన బహుమతి ఏమి ఉంటుంది చెప్పండి. లెనిన్ చిత్రానికి కూడా ఈ అభిమాని తన తోటి అభిమానులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ని కూడా అఖిల్ చూసారు. అది కూడా ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇక అఖిల్ ఈ అభిమానిని కలిసే రోజు సోషల్ మీడియా లో ఆ వీడియో ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో చూడాలి. ఒకప్పుడు ఈ వీడియో పెద్ద ట్రోల్ మెటీరియల్ అయ్యింది , కానీ ఇది ఇప్పుడు అభిమానులకు హై ఇచ్చే మూమెంట్ కాబోతుంది. సక్సెస్ ఇచ్చే కిక్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పడానికి ఇదొక నిదర్శనం.
