Akhanda: బాలయ్య బాబు ‘అఖండ’ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద తిరుగులేకుండా పోయింది. విడుదలై ’17’ రోజులు పూర్తి అవుతున్నప్పటికీ ఇప్పటికి అఖండ ఇంకా డీసెంట్ కలెక్షన్లను నమోదు చేస్తూనే ఉంది. పక్కా మాస్ ఎంటర్‌టైనర్ గా వచ్చిన ఈ సినిమా అటు యూఎస్ లో సైతం భారీ వసూళ్లను సాధిస్తోంది. మొత్తమ్మీద తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన మరియు భారీ కలెక్షన్స్ వస్తున్నాయి.
అసలు గత పదేళ్లలో ఒక సినిమా రిలీజ్ అయిన మూడో వారంలో కూడా తన ప్రభావం చూపించగలుగుతుంది అంటే.. బహుశా అది అఖండ ఒక్కటే అనుకుంటా. నేటికీ రిలీజ్ అయిన 17వ రోజు కూడా ఈ సినిమా కి పర్వాలేదనిపించే విధంగా కలెక్షన్స్ వస్తుండటం నిజంగా విశేషమే. మరి అఖండ మొత్తం 16 రోజుల కలెక్షన్ల వివరాలు చూస్తే..
నైజాం 18.40 కోట్లు
సీడెడ్ 13.83 కోట్లు
ఉత్తరాంధ్ర 5.76 కోట్లు
ఈస్ట్ 3.73 కోట్లు
వెస్ట్ 3.14 కోట్లు
గుంటూరు 4.33 కోట్లు
కృష్ణా 3.31 కోట్లు
నెల్లూరు 2.37 కోట్లు
ఏపీ మరియు తెలంగాణలో ఇప్పటి వరకు అఖండకు వచ్చిన కలెక్షన్స్ మొత్తం 54.87 కోట్లు.
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 9.81 కోట్లు
వరల్డ్ వైడ్ గా అఖండకు వచ్చిన కలెక్షన్స్ మొత్తం 64.68 కోట్లు.
‘అఖండ’ సినిమానికి రూ.53.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి రూ.10.88 కోట్ల లాభాలు వచ్చినట్టే. ఇక ఎలాగూ డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్ ఉన్నాయి. ఈ రైట్స్ అన్నీ కలుపుకుంటే మరో 36 కోట్లు ఈజీగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి.. ‘ద్వారకా క్రియేషన్స్’ మిర్యాల రవిందర్ రెడ్డికి భారీ లాభాలు వచ్చినట్టే.