spot_img
Homeఎంటర్టైన్మెంట్Pushpa Movie: రెండు ఓటీటీల్లో రిలీజ్ కానున్న... అల్లు అర్జున్ "పుష్ప"

Pushpa Movie: రెండు ఓటీటీల్లో రిలీజ్ కానున్న… అల్లు అర్జున్ “పుష్ప”

Pushpa Movie: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప పార్ట్ 1 విడుదలై అల్లు అర్జున్ అభిమానులను అలరిస్తుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన మూడో సినిమా ఇది. అంతకు ముందు ఆర్య, ఆర్య2 తెరకెక్కగా… ఆర్య సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. పుష్పలో బన్నీది నేలమాస్ క్యారెక్టర్ కావడంతో అభిమానుల పిచ్చి పీక్స్ కు వెళ్లింది. పుష్ప సినిమా విడుదలైన ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తో దూసుకుపోతూ… కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదలైంది. మలయాళంలో విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి మరో ప్లస్ అని చెప్పాలి. రష్మిక మందన్న కూడా తొలిసారి బన్నీతో జత కట్టి… డీ గ్లామర్ పాత్రలో అదరగొట్టింది.

allu arjun pushpa movie going to streaming on two ott platforms

కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుక్కుంది అని తెలుస్తుంది. అయితే తెలుగులో మాత్రం ఆహా ఓటీటీలో ప్రసారం అవుతుంది. మిగతా భాషల్లో మాత్రం ప్రైమ్ లో ప్రసారం అవుతాయని టాక్. ఎప్పుడు ఓటీటీలో విడుదలవుతుందన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ ఈ సినిమాలో పోలీసాఫీసర్ గా ప్రధాన పాత్రలో నటించాడు. సునీల్, అనసూయ మరో రెండు ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా పాటలు సూపర్ హిట్ అయ్యాయి. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా మొదటి రోజు రూ.36.72 కోట్ల భారీ వసూళ్లను రాబట్టింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...

NTR: కీలక నిర్ణయం దిశగా జూనియర్ ఎన్టీఆర్!

NTR: తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాతే ఎవరూ అంటే మాత్రం చటుక్కున లోకేష్ పేరు వస్తుంది. ప్రస్తుతం ఆయన అనధికార అధినేత తెలుగుదేశం పార్టీకి. పైగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్ని తానై...

Tammineeni Seetharam: ఏపీలో మారిన అరెస్టుల స్టైల్!

Tammineeni Seetharam: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అరెస్టు భయం వెంటాడుతోంది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కేసుల రూపంలో వెంటాడింది. కానీ కొందరు తమ వ్యవహార శైలితో ఏరి కోరి కేసులు తెచ్చుకున్నారు....

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Oktelugu Epaper
Exit mobile version