Sirivennela Seetharama Sastry: ఆయన సినిమా వాళ్ళకే కాదు, సాహిత్యానికే గురువు !

Sirivennela Seetharama Sastry: ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి గారి మరణం తెలుగు చలన చిత్ర సీమకే కచ్చితంగా తీరని లోటే. కారణం.. సీతారామశాస్త్రి గారి తన పాటతో.. ప్రేక్షకులకు సాహిత్యంపై గౌరవాన్ని పెంచారు. నిజంగానే ఆయన అంత అద్భుతమైన సాహిత్యం రాశారు. ఆయన పాటతో ప్రయాణం చేస్తాడు. పాటని ప్రేమిస్తాడు.. పాటతో రమిస్తాడు. అలాగే పాటని శాసిస్తాడు. అందుకే, ఆ ‘సిరివెన్నెల’ సాటి రారు ఏ పాటల రచయిత. ఎందుకంటే.. ఆయన తన పాట పల్లవిలోనే సూటిగా ప్రశ్నిస్తారు. […]

Written By: Shiva, Updated On : December 19, 2021 5:00 pm
Follow us on

Sirivennela Seetharama Sastry: ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి గారి మరణం తెలుగు చలన చిత్ర సీమకే కచ్చితంగా తీరని లోటే. కారణం.. సీతారామశాస్త్రి గారి తన పాటతో.. ప్రేక్షకులకు సాహిత్యంపై గౌరవాన్ని పెంచారు. నిజంగానే ఆయన అంత అద్భుతమైన సాహిత్యం రాశారు. ఆయన పాటతో ప్రయాణం చేస్తాడు. పాటని ప్రేమిస్తాడు.. పాటతో రమిస్తాడు. అలాగే పాటని శాసిస్తాడు.

Sirivennela Seetharama Sastry

అందుకే, ఆ ‘సిరివెన్నెల’ సాటి రారు ఏ పాటల రచయిత. ఎందుకంటే.. ఆయన తన పాట పల్లవిలోనే సూటిగా ప్రశ్నిస్తారు. ‘ఆది భిక్షువు వాడినేది కోరేది. బూడిదిచ్చేవాడినేది అడిగేది’ అంటూ ఈ అనంతమైన విశ్వమంతా శివమయమని, శివుని లీలలు మానవ మాత్రులకు ఎన్నటికీ అర్ధం కావని.. కేవలం రెండే రెండు వాక్యాలలో ఇంత గొప్పగా ఎవరు రాయగలరు ? అందుకే, సీతారామశాస్త్రి గారిని రచయిత అనేకన్నా… గొప్ప వేదాంతి అనాలేమో.

Also Read: “సిరివెన్నెల” చివరి సాంగ్ పై స్పందించిన నటి సాయి పల్లవి…

అదేంటో.. సీతారామశాస్త్రి గారు ఏ పాట రాసినా అది అందరికీ నచ్చుతుంది. కానీ సీతారామశాస్త్రి గారు అనగానే.. విధాత తలపున వంటి పాటలే ఎక్కువగా గుర్తుకు వస్తాయి. కానీ, నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అంటూ ఒక అంధురాలికి తన పాటతో రంగులు, ఋతువులను చూపించిన మహానుభావుడు ఆయన.

అలాగే మరో పాటలో ‘స్వప్నాల వెంట స్వర్గాల వేట’ అంటూ హీరో ఆడే దొంగాటలో కూడా గొప్ప ఫిలసాఫికల్ ఫీలింగ్స్ రాసిన గురువు ఆయన. ఇక గగనానికి ఉదయం ఒకటే, కెరటాలకు సంద్రం ఒకటే అంటూ ఈ జగమంత నియమాన్ని సింగిల్ లైన్ లో చెప్పిన తాత్వికుడు ఆయన.

అదేవిధంగా ‘ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల, నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ అంటూ నిరాశలో ఉన్న వాళ్లకు గొప్ప ప్రేరణను కలిగించిన మహా పురుషుడు ఆయన. అందుకే.. సీతారామశాస్త్రి సినిమా వాళ్ళకే కాదు, మొత్తం సాహిత్యానికే గురువు లాంటి వ్యక్తి.

Also Read: సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్యానికి ఏమైంది? ఆయన ఎందుకు చనిపోయారు? సంచలన నిజాలు

Tags