Akhanda: అనంతపురంలో బాలయ్య అభిమానుల సందడి.. థియేటర్లలో అఖండ విజయోత్సవం

Akhanda: కరోనా ప్రభావం సినిమాలపై భారీగా పడిందనే చెప్పాలి. ఆ తర్వాత నుంచి అనేక సినిమాలు షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయి.. ఏడాది క్రితం రావాల్సిన చిత్రాలన్నీ పోస్ట్​పోన్ అవుతూ వచ్చాయి. ఈ కోవలోనే బాలయ్య, బోయపాటి సినిమా అఖండ కూడా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు మళ్లీ పరిస్థితులు చక్కబడటంతో షూటింగ్ ముగించుకుని.. డిసెంబరు 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్​ అయ్యింది. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్​ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని నందమూరి ఫ్యాన్స్​ తెల్లవారుజామునుంచే సందడి ప్రారంభించారు. […]

Written By: Raghava Rao Gara, Updated On : December 2, 2021 12:45 pm
Follow us on

Akhanda: కరోనా ప్రభావం సినిమాలపై భారీగా పడిందనే చెప్పాలి. ఆ తర్వాత నుంచి అనేక సినిమాలు షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయి.. ఏడాది క్రితం రావాల్సిన చిత్రాలన్నీ పోస్ట్​పోన్ అవుతూ వచ్చాయి. ఈ కోవలోనే బాలయ్య, బోయపాటి సినిమా అఖండ కూడా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు మళ్లీ పరిస్థితులు చక్కబడటంతో షూటింగ్ ముగించుకుని.. డిసెంబరు 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్​ అయ్యింది. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్​ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని నందమూరి ఫ్యాన్స్​ తెల్లవారుజామునుంచే సందడి ప్రారంభించారు. ముఖ్యంగా ఏపీలో బాలయ్య అభిమానులు థేయటర్ల వద్ద సందడి మాములుగా లేదు.

https://twitter.com/nakkatoka/status/1466094570245029892?s=20

ఇక అనంతపురంలో అఖండ రిలీజ్​ సందర్భంగా బాలయ్య అభిమానులు సంబరాలు సందడి చేస్తున్నారు. ఈరోజు సినిమా రిలీజ్​ కావడంతో.. ఉదయం 5 గంటలనుంచే బెనిఫిట్ షో చూసిన అబిమానులు.. ఆనందంతో ఉరకలేస్తున్నారు. గౌరీ థియేటర్ కాంప్లెక్స్ ఇవాళ సినిమా చూసిన తరువాత బాలక్రిష్ణ అభిమాన సంఘం నాయకులు, మాజీ గ్రంథాలయ ఛైర్మన్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.
Also Read: డల్లాస్​లో అఖండ విజయోత్సవం.. నెట్టింట్లో వీడియో వైరల్​

Akhanda

అనంతరం థియేటర్ వద్ద కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. థియేటర్ ప్రాంగణం మొత్తం అభిమానులతో కిక్కిరిసిపోయింది. బాణా సంచా కాలుస్తూ అభిమానులు సందడి చేశారు. అఖండ సినిమాలో బాలక్రిష్ణ యాక్షన్ చూస్తే పూనకాలే అంటూ అభిమానులు చెబుతున్నారు. ఈసినిమా గతంలో ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని అంటున్నారు. బోయపాటి, బాలయ్య కలయికలో హ్యాట్రిక్ హిట్ గ్యారంటీ అంటున్నారు అభిమానులు.

Also Read: బాలయ్య అఖండ హిట్​ టాక్​ అందుకోవాలంటే రాబట్టాల్సిన కలెక్షన్​ ఎంతో తెలుసా?