Nagababu: నాగబాబుకు పని దొరికిందోచ్

Nagababu: మెగా బ్రదర్స్ లో నాగబాబు బ్యాడ్ లక్ కి కేర్ ఆఫ్ అడ్రస్. దురదృష్టం ఆయనతో ఎప్పుడూ దోస్తీ చేస్తూ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి అనే కొండంత అండ ఉండి కూడా నాగబాబు సక్సెస్ ని రుచి చూడపోయారు. అయ్యగారు ఎక్కడ అడుగుపెట్టినా మటాషే. నటుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు హీరో అవుదామనుకున్నాడు. హీరోగా విజయం దక్కలేదు. వెంటనే నిర్మాత అయ్యాడు. నాగబాబు నిర్మాతగా సినిమా అంటే అది పక్కా ప్లాప్ అని ఫిక్స్ కావడమే. […]

Written By: Neelambaram, Updated On : December 2, 2021 12:39 pm
Follow us on

Nagababu: మెగా బ్రదర్స్ లో నాగబాబు బ్యాడ్ లక్ కి కేర్ ఆఫ్ అడ్రస్. దురదృష్టం ఆయనతో ఎప్పుడూ దోస్తీ చేస్తూ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి అనే కొండంత అండ ఉండి కూడా నాగబాబు సక్సెస్ ని రుచి చూడపోయారు. అయ్యగారు ఎక్కడ అడుగుపెట్టినా మటాషే. నటుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు హీరో అవుదామనుకున్నాడు. హీరోగా విజయం దక్కలేదు. వెంటనే నిర్మాత అయ్యాడు. నాగబాబు నిర్మాతగా సినిమా అంటే అది పక్కా ప్లాప్ అని ఫిక్స్ కావడమే. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న చిరంజీవి లాంటి హీరోకి కూడా ఒక అట్టర్ ప్లాప్ ఇచ్చేస్తాడు నాగబాబు. చిరు నుండి చరణ్ వరకు తన సెంటిమెంట్ పవర్ రుచి చూపించాడు.

Nagababu

ఇక నాగబాబు అడుగుపెట్టిన మరొక రంగం పాలిటిక్స్. 2019లో నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుండి జనసేన తరపున పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ పోటీచేసిన రెండు చోట్ల ఓడిపోవడంతో.. నాగబాబు ఓటమి గురించి పెద్దగా ఎవరూ మాట్లాడుకోలేదు. బ్యాడ్ లక్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకునే నాగబాబు కెరీర్ లో చెప్పుకోవడానికి ఓ సక్సెస్ ట్రాక్ ఉంది. అదే జబర్దస్త్ షో. ఆరంజ్ మూవీ నాగబాబును అప్పుల ఊబిలో ముంచేయగా,దుర్భరమైన ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో జబర్దస్త్ షో మొదలైంది. ఆ షో జడ్జిగా రోజాతో పాటు వేదిక పంచుకునే అవకాశం నాగబాబుకు దక్కింది.

జబర్దస్త్ షో ఒక సంచలన విజయం సాధించగా నాగబాబు జీవితాన్ని గాడిన పెట్టింది. ఆర్థిక బాధల నుండి బయటపడేసింది. దినదినాభివృద్ధి చెందిన జబర్దస్త్ దాదాపు తొమ్మిదేళ్లుగా తిరుగులేని టీఆర్పీ తో ముందుకు సాగుతుంది. ఇక జబర్దస్త్ సక్సెస్ అంతా నా వల్లే అనుకున్న నాగబాబు… 2019లో బయటికి వచ్చి అదిరింది పేరుతో జీ తెలుగులో మరో కామెడీ షో స్టార్ట్ చేసి బొక్క బోర్లా పడ్డారు. ఆయన్ని నమ్ముకొని జబర్దస్త్ వదిలేసి వెళ్లిన చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ లాంటి వాళ్లకు పెద్ద షాక్ తగిలింది.

జబర్దస్త్ కి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయిన అదిరింది, త్వరగానే జెండా పీకేసింది. అదిరింది షాక్ నుండి కోలుకుని యూట్యూబ్ లో ఖుషీ ఖుషీగా పేరుతో స్టాండప్ కామెడీ షో నిర్వహించాడు. అది కూడా ఏమంత ఆదరణ దక్కించుకోలేదు. ఇక చాలా కాలంగా ఖాళీగా ఉంటున్న నాగబాబు ‘మా’ ఎన్నికల ఎపిసోడ్ లో కీలక రోల్ వహించారు. ప్రకాష్ రాజ్ తరపున ప్రచారం చేయడంతో పాటు ప్రత్యర్థి వర్గం పై విమర్శల దాడికి దిగారు. ప్రకాష్ రాజ్ ని నాన్ లోకల్ అన్న పుణ్యానికి కోటా లాంటి సీనియర్ నటుడిని ‘వాడు మనిషే కాదంటూ’ కామెంట్ చేశాడు. అక్కడ కూడా నాగబాబుకు పరాజయమే ఎదురైంది. ‘మా’ అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్ మంచు విష్ణు చేతిలో ఓడిపోయారు.

Also Read: Akhanda: అనంతపురంలో బాలయ్య అభిమానుల సందడి.. థియేటర్లలో అఖండ విజయోత్సవం

ఇదిలా ఉండగా ఖాళీగా ఉంటున్న నాగబాబుకు ఎట్టకేలకు పని దొరికింది. స్టార్ మా లో కొన్ని నెలల క్రితం ప్రారంభమైన స్టార్ కమెడియన్స్ షోకి నాగబాబు జడ్జిగా వచ్చారు. హీరోయిన్ శ్రీదేవి పక్కన కూర్చొని షో లో జాయిన్ అయ్యారు. గతంలో శేఖర్ మాస్టర్ ఈ షోకి మరో జడ్జిగా ఉండగా, ఇప్పుడు నాగబాబు వచ్చి చేరారు. మరి నాగబాబు పర్మినెంట్ గా ఈ షో జడ్జిగా ఉంటారా లేక టెంపరరీనా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Radhe Shyam: రాధేశ్యామ్ నుంచి మరో పాట విడుదల.. మరోసారి మాయ చేసిన సిద్​ శ్రీరామ్​

Tags