Ajith
Ajith : కొంతమంది దర్శకులు హీరోయిన్స్ ని కొన్ని ప్రత్యేకమైన పాత్రలు ఒప్పించడానికి అబద్దపు స్టోరీలు వినిపించి ఒప్పిస్తుంటారు. కాంట్రాక్టు మీద సంతకం చేసిన తర్వాత వాళ్ళ డేట్స్ ఎలాగో లాక్ అవుతుంది, మధ్యలో వదిలి వెళ్లిపోలేరు అనే ధైర్యంతో, కేవలం వాళ్ళ డేట్స్ కోసం ఏమార్చే కథలను చెప్తుంటారు. గతం లో నిజం సినిమా విషయంలో హీరోయిన్ రాశి(Heroine Raashi) ని అదే విధంగా ఒప్పించారు. ముందుగా చాలా పాజిటివ్ క్యారక్టర్ అని చెప్పారని, కానీ షూటింగ్ సెట్స్ లోకి వెళ్లిన తర్వాత విలన్ క్యారక్టర్ వేయించారని, ఎలాగో సినిమాకి కమిట్ అయ్యాను కాబట్టి పూర్తి చేసానని చెప్పుకొచ్చింది. ఇలా కేవలం రాశి విషయం లోనే కాదు, ఎంతో మంది హీరోయిన్స్ విషయం లో జరిగింది. ప్రముఖ తమిళ హీరోయిన్ మను చిత్ర కూడా ఇలాంటి కామెంట్స్ చేసి ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం గా మారింది.
అజిత్(Thala Ajith) లాంటి సూపర్ స్టార్ సినిమాలో నటించే అవకాశం వస్తే ఏ హీరోయిన్ అయినా అదృష్టం గా భావిస్తారు. మను చిత్ర(Manu Chitra) కూడా అలాగే భావించింది. కానీ ఆ చిత్ర దర్శకుడు చేసిన మోసం గురించి ఈమె మాట్లాడిన మాటలు వింటే ఇలా కూడా ఉంటారా మనుషులు అని అనిపించక తప్పదు. ఆమె మాట్లాడుతూ ‘నేను అజిత్ ‘వీరం'(Veeram Movie) చిత్రం లో ఒక కీలక పాత్ర చేశాను. ఆ చిత్ర దర్శకుడు శివ(Director Siva) నాకు స్టోరీ చెప్పే సమయంలో ఈ సినిమాలో హీరోయిన్ తమన్నా మధ్యలోనే చనిపోతుంది, ఆ తర్వాత ఆయనకు జోడీగా మీరే ఉంటారు అని చెప్పాడు. కానీ సెట్స్ మీదకు వెళ్లిన తర్వాత నాకు చెప్పిన స్టోరీ వేరు, తీస్తున్న స్టోరీ వేరు అనిపించింది. అజిత్ సినిమాలో హీరోయిన్ అనగానే నా జీవితానికి గొప్ప టర్నింగ్ పాయింట్ అవుతుంది, మరో లెవెల్ కి వెళ్ళిపోతాను అని అనుకున్నాను’.
‘ఈ చిత్రం కోసం హీరోయిన్ గా నాకు రెండు మూడు సినిమాల్లో అవకాశం వచ్చినా వాటిని వదులుకోవాల్సి వచ్చింది. నా పూర్తి సమయాన్ని అజిత్ సినిమాకి కేటాయించాలని అనుకున్నాను, కానీ డైరెక్టర్ ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు. వీరం చిత్రం వల్ల నా కెరీర్ చాలా దెబ్బ తినింది’ అంటూ ఆమె తన బాధని ఈ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. ప్రాధాన్యం లేని పాత్ర పోషించే బదులు, నాకు వస్తున్న హీరోయిన్ రోల్స్ సినిమాలు చేసుంటే ఈరోజు నా కెరీర్ వేరేలా ఉండేది అని ఆమె అభిప్రాయం. ‘వీరం’ చిత్రాన్ని తెలుగు లో పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో పవన్ కళ్యాణ్ తమ్ముళ్లు గా నటించిన వాళ్లకు కూడా జోడీలు ఉంటారు. అలాంటి జోడీలలో ఒకరిగా మను చిత్ర తమిళం లో చేసిందట. ఇక మీరే అర్థం చేసుకోవచ్చు ఆమెకు ఏ రేంజ్ అన్యాయం జరిగింది అనేది.