Venkatesh and Rajendra Prasad : కొన్నిసార్లు సినీ హీరోలకు కొన్ని చిత్రాలను వదులుకోవడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఏ రేంజ్ లో అంటే వాటి ప్రభావం వల్ల కెరీర్ లో మరో లెవెల్ కి వెళ్లే అరుదైన అదృష్టాన్ని కోల్పోతూ ఉంటారు. ఇది అన్ని ఇండస్ట్రీలలో ఉండేవే. అలా ప్రముఖ సీనియర్ హీరో, నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కెరీర్ లో కూడా జరిగింది. ఈయన చూడని హిట్స్ లేవు, చూడని ఫ్లాప్స్ లేవు. కెరీర్ లో ఎన్నో కష్టాలను చూసి ఈ రేంజ్ కి వచ్చాడు. ఒకప్పుడు కామెడీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన జానర్ ని ఏర్పాటు చేసుకొని ఎన్నో కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ ని అందుకున్నాడు. ఒకానొక సమయంలో ఆయన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పోటీని ఇచ్చాడు. అలా కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) కోల్పోయిన ఒక అవకాశం ఆయన కెరీర్ మరో లెవెల్ కి వెళ్లకుండా చేసింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే తమిళంలో ఆరోజుల్లో ప్రభు, కుష్బూ(Heroine Kushboo) హీరోహీరోయిన్లు గా నటించిన ‘చిన్న తంబీ(Chinna Tambi)’ అనే చిత్రం కమర్షియల్ గా అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఈ చిత్రాన్ని తెలుగు లో మన విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) ‘చంటి(Chanti Movie)’ పేరుతో రీమేక్ చేసి పెద్ద ఇండస్ట్రీ హిట్ ని అందుకున్నాడు. వాస్తవానికి ఈ సినిమాని ముందుగా రాజేంద్ర ప్రసాద్ రీమేక్ చేయాలనుకున్నాడు. ‘చిన్నతంబీ’ నిర్మాతల వద్దకు వెళ్లి రీమేక్ రైట్స్ ని కొనుగోలు చేయాలని అనుకున్నాడు. ముందుగా వాళ్ళు రాజేంద్ర ప్రసాద్ కి రైట్స్ అమ్మడానికి ఒప్పుకున్నారు. కానీ ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ, రెండు రోజుల తర్వాత ఆ రైట్స్ ని కేఎస్ రామారావు కొనుగోలు చేసారని రాజేంద్ర ప్రసాద్ కి తెలిసింది.
అదేంటి నేను ముందు అడిగాను కదా అని రాజేంద్ర ప్రసాద్ ‘చిన్న తంబీ’ మేకర్స్ కి ఫోన్ చేసి అడగగా, రామానాయుడు గారు ఈ రైట్స్ ని తన కొడుకు సినిమా కోసం రిక్వెస్ట్ చేశారండీ, అంత పెద్ద వ్యక్తి అడిగేలోపు కాదు అనలేకపోయాను, నన్ను క్షమించండి అంటి రాజేంద్ర ప్రసాద్ కి సర్దిచెప్పారట. దీనికి రాజేంద్ర ప్రసాద్ అప్పట్లో చాలా హర్ట్ అయ్యాడని సమాచారం. చాలా కాలం వరకు విక్టరీ వెంకటేష్ తో కలిసి సినిమాలు చేసే అవకాశం వచ్చినప్పటికీ రాజేంద్ర ప్రసాద్ ఈ కారణంగా చేత ఒప్పుకోలేదు. వీళ్ళ కాంబినేషన్ చివరకు F2 , F3 సినిమాలకు కుదిరింది. అది కూడా ఆయన అనీల్ రావిపూడి మీద అభిమానంతో చేశాడని సమాచారం. ఒకవేళ చంటి రాజేంద్ర ప్రసాద్ చేసి ఉండుంటే, ఆరోజుల్లో ఆయన మరింత పీక్ రేంజ్ ని కెరీర్ పరంగా చూసేవాడు, దురదృష్టం అంటే ఇదే అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.