Virat Kohli
Virat Kohli: ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఫామ్ లో లేడు. దారుణంగా ఆడుతున్నాడు. పరుగులు తీయడంలో ఇబ్బంది పడుతున్నాడు. అయినప్పటికీ అతడి ఫ్యాన్ బేస్ ఏ మాత్రం చెక్కుచెదరలేదు. అతని ఆటను చూడ్డానికి ప్రేక్షకులు భారీగా వస్తున్నారు. అతడితో ఒక ఫోటో దిగడానికి.. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు.. అయితే అంతటి ఫ్యాన్ బేస్ ఉన్న విరాట్ కోహ్లీ ఒక మహిళ దగ్గరికి స్వయంగా వెళ్ళాడు. పైగా ఆమెను ఆలింగనం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. కోట్లాదిమంది అభిమానులు ఉన్న విరాట్ కోహ్లీ స్వయంగా వెళ్లి ఒక మహిళను ఆలింగనం చేసుకోవడం చర్చకు దారితీస్తుండగా.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకోవడానికి అభిమానులు తెగ ప్రయత్నం చేస్తున్నారు.
కటక్ వన్డేలో విజయం సాధించిన తర్వాత.. ఇంగ్లాండ్ జట్టుతో బుధవారం అహ్మదాబాద్ వేదికగా జరిగే మూడో వన్డే ఆడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే అహ్మదాబాద్ వెళ్లడానికి భువనేశ్వర్ విమానాశ్రయానికి చేరుకుంది. అవిమానాశ్రయంలో తనిఖీ కేంద్రానికి ముందు కొంతమంది అభిమానులు విరాట్ కోహ్లీ, ఇతర ఆటగాళ్లను చూసేందుకు వచ్చారు. ఆ క్రమంలో విరాట్ కోహ్లీ ఆ గుంపులో ఉన్న ఒక మహిళను చూసి చిరునవ్వు చిందించాడు. నేరుగా ఆమె వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. అయితే సెక్యూరిటీ సిబ్బంది కలగజేసుకొని.. భద్రతా కారణాలను వివరించి.. విరాట్ కోహ్లీని అక్కడి నుంచి పంపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.. అయితే విరాట్ కోహ్లీ అభిమానుల విషయంలో ఎంతో హుందాగా ఉంటాడు. వారితో ఫోటోలు దిగుతుంటాడు. ఆటోగ్రాఫ్ లు ఇస్తుంటాడు. కరచాలనం కూడా ఇస్తుంటాడు. అయితే అటువంటి విరాట్ కోహ్లీ ఒక్కసారిగా ఒక మహిళ వద్దకు వెళ్లి.. ఆలింగనం చేసుకోవడం.. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించడం వంటివి సంచలనంగా మారాయి. ఆ మహిళ ఎవరో తెలుసుకోవడానికి విరాట్ కోహ్లీ అభిమానులు తెగ ప్రయత్నించారు. చివరికి వారి అన్వేషణ ఫలించింది. విరాట్ కోహ్లీ ఆ స్థాయిలో ఆ మహిళను ఆ లింగనం చేసుకోవడానికి ప్రధాన కారణం.. ఆమె అక్కడికి దగ్గర బంధువు అని తెలిసింది. చాలా రోజుల తర్వాత ఆమెను చూడటంతో.. ఆ ఉద్విగ్నాన్ని తట్టుకోలేక ఆలింగణం చేసుకున్నట్టు తెలుస్తోంది. ” ఆమె అదృష్టవంతురాలు. కోట్లాదిమందికి దక్కని అదృష్టం ఆమెకు దక్కింది. నేరుగా విరాట్ కోహ్లీ ఆమె వద్దకు వెళ్లి ఆలింగనం చేసుకోవడం చూస్తున్న మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నిజంగా విరాట్ కోహ్లీ అలా ఒక మహిళ వద్దకు వెళ్లడం ఎప్పుడూ చూడలేదు. ఆమె ఎవరని ఆరా తీస్తే విరాట్ కోహ్లీకి దగ్గర బంధువు అని తేలింది. మొత్తానికి ఆమె విరాట్ కోహ్లీ ఆలింగనం తర్వాత ఆనందపడింది. ఆమె సంతోషానికి అవధి అనేది లేకుండా పోయిందని” సోషల్ మీడియాలో విరాట్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
Virat Kohli met a lady (close relative) at Bhubaneswar airport❤️ pic.twitter.com/r71Du0Uccf
— (@wrognxvirat) February 10, 2025