https://oktelugu.com/

Ajith Kumar: అజిత్ ఫస్ట్ లుక్ తోనే అంచనాలు పెంచేశారుగా..?

ఇప్పుడు డైరెక్ట్ తెలుగులో ఒక సినిమా చేయడానికి అవకాశం అయితే వచ్చింది. ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఆయన 'గుడ్ బాడ్ అగ్లీ' అనే ఒక సినిమాని చేస్తున్నాడు. అయితే దీనికి 'అధిక్ రామచంద్రన్ ' దర్శకత్వం వహిస్తున్నాడు.

Written By: , Updated On : May 20, 2024 / 04:12 PM IST
Ajith Kumar Good Bad Ugly First Look

Ajith Kumar Good Bad Ugly First Look

Follow us on

Ajith Kumar: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న నటుడు అజిత్.. ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఏదో ఒక వైవిధ్యమైన కథాంశంతో అయితే ఉంటాయి. ఈయన గత రెండు మూడు సినిమాల నుంచి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాడు. కాబట్టి ఈయన ఎలాగైనా సరే ఒక మంచి సక్సెస్ ని అయితే సాధించాల్సిన అవసరం అయితే వచ్చింది. ఇక దాంతో పాటుగా ఆయన డైరెక్ట్ గా తెలుగులో ఒక సినిమా చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాడు.

ఇక ఇప్పుడు డైరెక్ట్ తెలుగులో ఒక సినిమా చేయడానికి అవకాశం అయితే వచ్చింది. ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఆయన ‘గుడ్ బాడ్ అగ్లీ’ అనే ఒక సినిమాని చేస్తున్నాడు. అయితే దీనికి ‘అధిక్ రామచంద్రన్ ‘ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాతో ఎలాగైనా తెలుగులో మంచి సక్సెస్ సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈయన చేస్తున్న మొదటి సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవాలని అజిత్ ప్రయత్నం చేస్తున్నాడు…మరి దానికి అనుకూలంగానే ఈ సినిమా కోసం ఆయన ఒక మంచి స్క్రిప్ట్ తో ముందుకు కదులుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక రీసెంట్ గా ఈ సినిమా మీద హైప్ పెంచడానికి ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఇక ఈ పోస్టర్ లో అజిత్ టైటిల్లో చెప్పినట్టుగానే మూడు డిఫరెంట్ వేరియేషన్లలో మనకు కనిపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. నిజానికి ఒక క్యారెక్టర్ లో నటించి మెప్పించాలంటే అజిత్ లాంటి డెడికేషన్ తో నటించే నటులు చాలా తక్కువ మంది ఉంటారు. ఇక బాడీపరంగా ఆయన కొంచెం ఓవర్ వెయిట్ గా అనిపించినప్పటికీ ఇంజురీస్ వల్ల ఆయన వెయిట్ తగ్గలేకపోతున్నాడు అనేది మనందరికీ తెలిసిన విషయమే.

అయినప్పటికీ ఆయన ఒక క్యారెక్టర్ లో నటిస్తున్నాడు అంటే ఆ క్యారెక్టర్ కి పూర్తిగా సరేండర్ అయిపోయి నటించి ప్రేక్షకుడి చేత శభాష్ అనిపించుకునేలా పర్ఫామెన్స్ ఇవ్వడం లో ఆయన ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. కాబట్టి అజిత్ లాంటి దర్శకుడి నుంచి ఒక సినిమా వస్తుందంటే ఆ సినిమా మీద ప్రేక్షకులకు మంచి అంచనాలైతే ఉంటాయి… ఇక ఈ సినిమా కూడా భారీ సక్సెస్ ని సాధిస్తుందని సినిమా యూనిట్ భావిస్తుంది…