Prashanth Neel films : ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు. ఇక కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తున్న ప్రశాంత్ నీల్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయాడు.ప్రస్తుతం ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హీరో అతనితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కి చాలా ప్రత్యేకమైన స్థానమైతే ఉంది. ఆయన ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమాతో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశాన్ని ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక మొత్తానికైతే ఇప్పటి వరకు చేసిన చాలా సినిమాలతో మంచి గుర్తింపును అయితే సంపాదించుకున్నాడు. మరి ఇప్పటివరకు నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం హీరోగా తను పూర్తి బాధ్యతలను కొనసాగిస్తూ ఆ ఫ్యామిలీ యొక్క స్టార్ డమ్ ను ముందుకు తీసుకెళ్లడంలో జూనియర్ ఎన్టీఆర్ చాలా వరకు కృషి చేస్తున్నాడు. ఇప్పటికే ఏటీఆర్ ఈ సినిమా మీద భారీ ఆశలైతే పెట్టుకున్నాడు. ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుందంటూ ఆయన చాలా వరకు కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నాడు.
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులు బ్రేక్ అవ్వబోతున్నాయి అంటూ ప్రశాంత్ నీల్ సైతం తెలియజేయడం విశేషం. ఈ సినిమాని అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా అంటే అది ఏ రేంజ్ లో ఉంటుందో మనందరికి తెలిసిందే.
Also Read: నా తమ్ముడు నా పతనం కోరుకున్నాడు..ప్రభాస్ కి రుణపడి ఉంటాను – మంచు విష్ణు
ఇక ఈ సినిమా కూడా దానికి ఏ మాత్రం తగ్గకుండా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఉండబోతుంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ఎవరితో సినిమా చేయాబోతున్నాడనే విషయంలో సరైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇక ఇప్పటికే సలార్ 2 (Salaar 2)సినిమాని స్టార్ట్ చేయాల్సిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ బిజీగా ఉండడం వల్ల డ్రాగన్ (Dragon) సినిమాని స్టార్ట్ చేశాడు. ఈ సినిమా తర్వాత అతను సలార్ 2 సినిమాను కంప్లీట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
దాంతో పాటుగా కే జి ఎఫ్ 3 (KGF 3)సినిమాలను కూడా లైన్లో పెట్టే అవకాశాలైతే ఉన్నాయి. ఇక రామ్ చరణ్ (Ram Charan) తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు. మరి ఇవన్నీ సినిమాలను ఎప్పుడు కంప్లీట్ చేస్తాడు. సంవత్సరానికి ఒక సినిమా చొప్పున వరుసగా సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతాడా అలాగే ఆయా హీరోలకు భారీ సక్సెస్ ను కట్టబెడతాడా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…