Ajith : తమిళ సూపర్ స్టార్స్ లో ఒకరైన తల అజిత్ కుమార్(Thala Ajith Kumar) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly Movie) కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చాలా కాలం నుండి అజిత్ నుండి సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఈ సినిమా ఒక విజువల్ ఫీస్ట్ లాగా అనిపించింది. అందుకే బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 250 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ తో పాటు, ఆడియన్స్ కూడా చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారు. నిన్న విడుదలైన కొత్త సినిమాల కారణంగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ థియేటర్స్ లో బాగా ఆడుతున్నప్పటికీ తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసినట్టే అనుకోవచ్చు.
Also Read : మరోసారి పల్టీలు కొట్టిన హీరో అజిత్ కార్..వణుకుపుట్టిస్తున్న విజువల్స్!
అందుకే ఇప్పుడు ఓటీటీ కి వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ అన్ని భాషలకు కలిపి నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ ఫ్యాన్సీ రేట్ కి కొనుగోలు చేసింది. ఈ నెల 8వ తేదీ నుండి ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్టు కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన చేసారు. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, ఓటీటీ లో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి. ఫిబ్రవరి నెలలో విడుదలైన అజిత్ విడాముయార్చి చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. కానీ ఓటీటీ లో మాత్రం ఈ సినిమా 5 వారాలకు పైగా ట్రెండ్ అయ్యింది. ఫ్లాప్ సినిమాకే ఆ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందంటే, ఇక సూపర్ హిట్ సినిమాకు ఏ రేంజ్ లో వస్తుందో ఊహించుకోవచ్చు.
అయితే అజిత్ ఫ్యాన్స్ లో మాత్రం ఒక సంతృప్తి అలాగే ఉండిపోయింది. ఎందుకంటే థియేటర్స్ లో అద్భుతంగా నడుస్తున్న సినిమాని, ఇంకా కొన్ని రోజులు కొనసాగించి ఉండుంటే, కచ్చితంగా మరో పది కోట్ల రూపాయిల గ్రాస్ కలిసొచ్చేదని, కొత్త సినిమాల కారణంగా ఆ ఛాన్స్ మిస్ అయ్యిందని బాధపడుతున్నారు. చెన్నై సిటీ లో కేవలం 13 షోస్ మాత్రమే ప్రస్తుతం షెడ్యూల్ చేయబడ్డాయి. ఆ 13 షోస్ కూడా హౌస్ ఫుల్స్ ని నమోదు చేసుకుంది.ఇంకా ఎక్కువ షోస్ ఉండుంటే బాగుండేది అని అజిత్ ఫ్యాన్స్ ఆవేదన. ఇకపోతే అజిత్ రీసెంట్ గానే రాష్ట్రపతి చేతుల మీదుగా ‘పద్మభూషణ్ ‘ అవార్డుని అందుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. దాదాపుగా పదేళ్ల తర్వాత ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా సోషల్ మీడియా లో ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది.
Also Read : నెలకు 15 కోట్లు..5వ తేదీ దాటితే నిర్మాతలకు చుక్కలే అంటున్న అజిత్!