Ajith Car: తమిళ హీరో అజిత్(Thala Ajith) కి రేసింగ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దుబాయి లో జరిగిన కార్ రేస్ ఈవెంట్ లో ఆయన ఇండియాకు బ్రోన్జ్ మెడల్ ని తెచ్చిపెట్టాడు. అంతే కాదు అజిత్ కి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మీద అద్భుతమైన పరిజ్ఞానం ఉంది. రెండు మూడు సంవత్సరాల క్రితం వరకు కూడా ఆయన విద్యార్థులకు ఉచితంగా బోధనలు సీనియర్ ప్రొఫెసర్ స్థాయిలో చేస్తుండేవాడు. అలా కేవలం రీల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా హీరో అని అజిత్ ఎన్నో సందర్భాల్లో నిరూపించుకున్నాడు. అందుకే ఆయనకు తమిళనాడు లో ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉంటారు. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఆయన సినిమాలకు కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ రావడానికి ప్రధాన కారణం, ఆయనలో ఉన్నటువంటి ఇలాంటి గుణాలే. మనిషి కూడా చాలా సింపుల్ గా ఉంటాడు, ఇది ఆయన్ని మిగతా హీరోలతో పోలిస్తే స్పెషల్ అనిపించేలా చేశాయి.
అయితే అజిత్ తన చేతిలో ఉన్న రెండు సినిమాలను పూర్తి చేసి, విదేశాల్లో రేసింగ్ ఈవెంట్స్ లో గత రెండు మూడు నెలల నుండి విరామం లేకుండా పాల్గొంటున్నాడు. అయితే ఈ రేసింగ్ ఈవెంట్స్ లో అజిత్ కి రెండు సార్లు ప్రమాదం జరగడం మనమంతా చూసాము. ఆయన కారు పల్టీలు కొట్టిన తీరుని చూసి అభిమానులు వణికిపోయారు. మన టైం బాగాలేనట్టు ఉంది అన్నయ్య, దయచేసి వెనక్కి వచ్చేయ్ అంటూ సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేసేవాళ్ళు. కానీ అజిత్ ఒక్కసారి కమిట్ అయితే, ఆయన మాట ఆయనే వినని టైపు. కుటుంబ సభ్యులు కూడా ఈ రిస్క్ ఎందుకు అని రెండు సార్లు ప్రమాదం జరిగినప్పుడు అజిత్ కి కచ్చితంగా చెప్పే ఉంటారు. కానీ ఆయన మాత్రం వినడం లేదు.
ఫలితంగా ఈరోజు కూడా ఆయన రేసింగ్ లో తన కారుని పల్టీలు కొట్టించాడు. జోరు వానలో రేసింగ్ చేస్తూ ఉన్న అజిత్, వాలుగా ఉన్నటువంటి రోడ్ పై వేగం గా వస్తూ అదుపు తప్పి పక్కనే ఉన్న ఒక గోడని గుద్దుకున్నాడు. దీంతో కార్ ఇంజిన్ ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. అదృష్టం కొద్దీ ఈసారి కూడా అజిత్ కి ఎలాంటి గాయాలు కాలేదు కానీ, ఆయన కార్ ప్రమాదానికి గురైన వీడియో ని చూసి మాత్రం అభిమానులు వణికిపోతున్నారు. ఇంకెన్ని సార్లు ఇలాంటి ప్రమాదాలకు గురి అవుతుంటావు , నీ వయస్సు 50 దాటింది, దయచేసి చూసుకోండి అంటూ అభిమానులు కన్నీళ్లతో కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే అజిత్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly) భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. నిన్నటితో 200 కోట్ల గ్రాస్ ని రాబట్టిన ఈ సినిమా ఫుల్ రన్ లో 300 కోట్లు రాబట్టే అవకాశం ఉంది.
Ajith Kumar’s car met in an accident during a race#AjithKumarRacing pic.twitter.com/bZ28EG3sQX
— Telugu360 (@Telugu360) April 19, 2025