Ajith : కొంతమంది స్టార్ హీరోలు రెమ్యూనరేషన్ విషయం లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. వాళ్ళ మార్కెట్ ఎలా ఉంటుంది, ఏమిటి అనేది వాళ్లకు అవసరం లేదు. ఒక సినిమాకు కమిట్ అయితే డబ్బింగ్ చెప్పే ముందే రెమ్యూనరేషన్ మొత్తం క్లియర్ చేయాలి. లేకపోతే డబ్బింగ్ కూడా చెప్పము అంటూ మొండికేసిన హీరోలను గతంలో మనం చాలాసార్లు చూసాము. కొంతమంది నిర్మాతలు అలాంటి హీరోలపై డైరెక్ట్ గా మీడియా ముందుకొచ్చి వాపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేటి తరం స్టార్ హీరోలు ప్రస్తుతం వంద కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ కి అసలు తగ్గడం లేదు. ఎందుకంటే థియేట్రికల్ రైట్స్ తో పాటు, నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా భారీ రేట్స్ కి అమ్ముడుపోతున్నాయి కాబట్టి మేము రెమ్యూనరేషన్ ని భారీగా అడగడంలో తప్పు లేదని అంటున్నారు హీరోలు. నిర్మాతలు కూడా మరో మాట మాట్లాడకుండా అడిగినంత ఇచ్చేస్తున్నారు.
Also Read : పవన్ కళ్యాణ్, వెంకటేష్ చెప్పిన డైలాగ్స్ రిపీట్ చేసిన హీరో అజిత్..వీడియో వైరల్!
ముఖ్యంగా తమిళ హీరో అజిత్(Thala Ajith) రెమ్యూనరేషన్ విషయం లో చాలా అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడట. ఒక సినిమాకు ఆయన సంతకం చేయాలంటే నిర్మాతలు టోకెన్ అడ్వాన్స్ గా 10 కోట్ల రూపాయిలు ఇవ్వాలట. ఇక తర్వాత అజిత్ తన రెమ్యూనరేషన్ ని నెలవారీ జీతం గా తీసుకుంటాడట. సినిమా ప్రారంభం నుండి షూటింగ్ ముగిసే వరకు ఎన్ని నెలలు ఆయన సెట్స్ మీద ఉంటే, అన్ని నెలలు రెమ్యూనరేషన్ ఇవ్వాలట. ప్రతీ నెల ఆయనకు నిర్మాతలు 15 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని ఇస్తారట. ప్రతీ నెల 5వ తేదీ వచ్చిందంటే ఆయన అకౌంట్ లోకి 15 కోట్లు జమ అవ్వాల్సిందే. ఒకవేళ బ్యాంక్ సెలవు దినం వస్తే నాల్గవ తేదీన వెయ్యాలట. ఉదాహరణకు అజిత్ ఒక సినిమాకు 10 నెలలు పని చేస్తే 160 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ ని అందుకుంటాడట.
రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly) చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. ఈ చిత్రం షూటింగ్ ని కేవలం మూడు నెలల్లో పూర్తి చేశారట. అంటే టోకెన్ అడ్వాన్స్ 10 కోట్లతో పాటు, మూడు నెలల రెమ్యూనరేషన్ 45 కోట్లు, మొత్తం మీద 55 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ + GST. అంటే ఈ సినిమా చేసినందుకు అజిత్ జోబుల్లోకి 70 కోట్ల రూపాయలకు పైగానే వెళ్లి ఉండొచ్చు. కావాలని ఎక్కువ రెమ్యూనరేషన్ కోసం నెలల తరబడి షూటింగ్స్ ని సాగదీసే మనస్తత్వం కూడా అజిత్ ది కాదట. సాధ్యమైనంత తొందరగానే ఆయన షూటింగ్ ని పూర్తి చేస్తాడని, నిర్మాతలకు ఏ కష్టం కలిగించడని అంటున్నారు. తమిళం లో ఉండేది ముగ్గురు స్టార్ హీరోలే, అందులో అజిత్ ఒకడు. ఈ ముగ్గురు హీరోలు అక్కడ ఎలాంటి చెత్త సినిమా తీసినా ఆడియన్స్ చూస్తారు కాబట్టి, ఎంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినా తప్పు లేదని అంటున్నారు విశ్లేషకులు.
Also Read : డైరెక్ట్ తెలుగు సినిమా చేయబోతున్న హీరో అజిత్..డైరెక్టర్ ఎవరంటే!