Ajay Devgn Remuneration: ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో గొప్ప గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న హీరోలు చాలామంది ఉన్నారు. అయినప్పటికి ఇకమీదట చేయబోయే సినిమాలతో వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు.
Also Read: శ్రీకాంత్ ఓదెల మీద కన్నేసిన మంచు విష్ణు…మోహన్ బాబు సూపర్ హిట్ మూవీని రీమేక్ చేస్తున్నారా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇప్పటివరకు వాళ్ళు సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇక మీదట సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకున్న హీరోలు చాలామంది ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ మంచి గుర్తింపు లభిస్తోంది. ఇక తెలుగులో ఉన్న స్టార్ హీరోలు సైతం పాన్ ఇండియా బాట పట్టి ముందుకు సాగుతున్న క్రమంలో మన హీరోలు భారీ ఎత్తున రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. కానీ మన హీరోలను అలాగే బాలీవుడ్ లో ఉన్న ఖాన్ త్రయం గా పిలువబడే సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ లను మించి ఒక హీరో భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ను తీసుకున్నారనే విషయంలో చాలా మందికి తెలియదు. ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే అజయ్ దేవగన్ (Ajay Devagan)….
త్రిబుల్ ఆర్ (RRR) సినిమాలో ఆయన రామ్ చరణ్ (Ram Charan) తండ్రిగా నటించాడు. ఈ సినిమా కోసం ఆయన రోజుకి 4.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. మొత్తం ఎనిమిది రోజులకు గాను 35 కోట్ల రెమ్యూనరేషన్ ని తీసుకొని స్టార్ హీరోలందరికి షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఆయనకి మంచి గుర్తింపును తీసుకొచ్చే విధంగా ఉండబోతుందనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది.
ఇక త్రిబుల్ ఆర్ (RRR) సినిమాలో అజయ్ దేవగన్ పాత్ర చాలా కీలకమైంది. దానికోసమే రాజమౌళి భారీ మొత్తం లో రెమ్యూనరేషన్ చెల్లించి మరి అజయ్ దేవగన్ ని అందులో భాగం చేశాడు. మొత్తానికైతే ఈ సినిమాతో అజయ్ దేవగన్ (Ajay Devagan) భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోవడమే కాకుండా తనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా సంపాదించి పెట్టుకున్నాడు.
ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వరుసగా ముందుకు సాగుతూ మరికొన్ని తెలుగు సినిమాల్లో కూడా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పటివరకు ఈయన సాధించిన సక్సెస్ లు ఆయనను చాలా గొప్ప రేంజ్ లో చూపిస్తే ఇకమీదట రాబోయే సినిమాలు సైతం అతనికి మరింత సక్సెస్ లను కట్టబెట్టాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నాడు. ఆయన ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకోవడం ఖాన్ త్రయాన్ని సైతం భయపెట్టిందనే చెప్పాలి…