https://oktelugu.com/

మహేశ్‌ మూవీపై బాలీవుడ్‌ స్టార్ కన్ను!

భారత చిత్ర పరిశ్రమలో భాష, ప్రాంతీయ హద్దులు తొలగిపోయాయి. ఒకప్పుడు బాలీవుడ్‌ మూవీస్‌ ఇతర భాషల్లో డబ్‌ లేదా రీమేక్‌ అవడం సాధారణం. కానీ, ఇప్పుడు ప్రాంతీయ భాషల సినిమాలు హిందీకి వెళ్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది హిట్‌ చిత్రాలు బాలీవుడ్‌లో రీమేక్‌ల బాట పడుతున్నాయి. గతంతో పోల్చితే ఆ జాబితాలో ఈ మధ్య తెలుగు సినిమాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. Also Read: మాజీ మిస్ ఇండియా వరల్డ్ కు కరోనా.. ఆందోళనలో ఫ్యాన్స్ ‘బాహుబలి’ వచ్చిన […]

Written By: , Updated On : August 10, 2020 / 08:15 PM IST
Follow us on

భారత చిత్ర పరిశ్రమలో భాష, ప్రాంతీయ హద్దులు తొలగిపోయాయి. ఒకప్పుడు బాలీవుడ్‌ మూవీస్‌ ఇతర భాషల్లో డబ్‌ లేదా రీమేక్‌ అవడం సాధారణం. కానీ, ఇప్పుడు ప్రాంతీయ భాషల సినిమాలు హిందీకి వెళ్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది హిట్‌ చిత్రాలు బాలీవుడ్‌లో రీమేక్‌ల బాట పడుతున్నాయి. గతంతో పోల్చితే ఆ జాబితాలో ఈ మధ్య తెలుగు సినిమాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది.

Also Read: మాజీ మిస్ ఇండియా వరల్డ్ కు కరోనా.. ఆందోళనలో ఫ్యాన్స్

‘బాహుబలి’ వచ్చిన తర్వాత తెలుగు ఇండస్ట్రీపై ఉన్న చులకన భావం పోయింది. చాలా మంది బాలీవుడ్‌ బడా నటులు తెలుగులో నటిస్తున్నారు. ఇక్కడి హిట్‌ చిత్రాలను అక్కడ రిమేక్‌ చేసేందుకు పోటీ పడుతున్నారు. రీసెంట్‌గా అర్జున్‌ రెడ్డి.. కబీర్ సింగ్‌గా రీమేక్‌ అయి భారీ విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నువ్వోస్తానంటే నేనొద్దంటానా, వర్షం, పరుగు, క్షణం, కిక్‌, విక్రమార్కుడు, మర్యాద రామన్న.. వంటి చిత్రాలు బాలీవుడ్‌లో రీమేక్‌ అయి ప్రేక్షకులను అలరించాయి.

వీటికంటే ముందు మహేశ్‌ బాబు సూపర్ హిట్‌ మూవీ ‘పోకిరి’ని సల్మాన్‌ ఖాన్‌ ‘వాంటెడ్‌’గా తీసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మహేశ్‌ మరో మూవీ కూడా బాలీవుడ్‌ బాట పట్టనుంది. మహేశ్‌, సమంత హీరోయిన్లుగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘దూకుడు’ తెలుగు బ్లాక్‌ బస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీనే ఇప్పుడు బాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఈ చిత్రం రైట్స్‌ ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ కొనగోలు చేసింది. స్టార్ హీరో అజయ్‌ దేవగణ్‌తో దీన్ని రీమేక్‌ చేయాలని చూస్తోందని సమాచారం.

Also Read: రెమ్యునిరేషన్ పెంచితే న్యూడ్ సీన్స్ కైనా రెడీ !

వాస్తవానికి ‘దూకుడు’ రీమేక్‌కు మొదట సల్మాన్‌ ఖాన్‌ను అనుకున్నారట. కానీ, ఇతర కారణాల వల్ల అతను ముందుకు రాకపోవడంతో అజయ్‌ దేవగణ్‌కు సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న అజయ్‌.. దూకుడు గురించి తెలుసుకొని ఓకే చెప్పినట్టు సమాచారం. సౌత్‌ మూవీస్‌ రీమేక్‌కు అతనికి కొత్తేం కాదు. ఇదివరకు సూర్య హీరోగా నటించిన ‘యముడు’ను అజయ్‌.. ‘సింగం’ పేరుతో రీమేక్‌ చేసి హిట్‌ కొట్టాడు. ఇప్పుడు దూకుడు రీమేక్‌తో అతని ఖాతాలో మరో 100 కోట్ల హిట్‌ పడడం పక్కా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.