ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితికి తగ్గట్టు వ్యవహరించడంలో బాగా రాటుదేలిపోయాడు. ప్రస్తుతం కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లా వాసులు రాజధాని విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పై మండిపడుతున్నారు. ఇక అమరావతి రాజధాని ప్రాంత ప్రజలు అయితే తమను మోసం చేశారని రైతుల వద్ద భూములు తీసుకొని ఇప్పుడు అన్యాయం చేశారని తిట్టిపోస్తున్నారు. ఇలాంటి సమయంలో అసలు అటువైపు కన్నెత్తి చూడడానికి కూడా ఏ వైసిపి నేత సిద్ధంగా లేరు.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ క్లిష్టమైన పరిస్థితి నుంచి బయటపడేందుకు టిడిపి లీడర్ లకు బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు. అది కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేతలకు అయితే నెక్స్ట్ లెవెల్ ఫేవర్స్ వైసీపీ ప్రభుత్వం నుండి రానున్నాయి. విషయమేమిటంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన టిడిపి వారు వైసీపీ కండువా కప్పుకుంటే వారికి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలలో ఏదో ఒక కీలకమైన అధికార పార్టీ తరఫున ఇస్తారు. అలాగే వారికి టికెట్లు, మంత్రి పదవి కూడా ఖాయం అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
పదవిలో లేకపోయినా ఆ నాయకుడు చేయాల్సింది ఏమిటంటే.. పైన చెప్పబడిన మూడు జిల్లాల్లో ఎక్కువగా ఉండే కమ్మ సామాజిక వర్గం వారి నుండి వచ్చే నేతలు మాత్రం అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చేలా ఇంకా ప్రతిపక్షం వైపుకి సమస్యను మళ్ళించేలా వ్యవహరించాలని జగన్ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే తమ పార్టీ నుండి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి ముఖ్య పదవులు ఇచ్చి మంచి స్థానాల్లో నిలబెడితే అమరావతి రైతుల నుండి వ్యతిరేకత ఎంతో కొంత తగ్గుతుంది అన్నది జగన్ వ్యూహంలా కనిపిస్తోంది. దీనికోసమే టిడిపి నుండి వచ్చే ఎవరికైనా ఈ బంపర్ ఆఫర్ రెడీగా ఉందని వచ్చి రెండు చేతులు చాచి అందిపుచ్చుకోవడమే లేట్ అని అని వైసీపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.