https://oktelugu.com/

Daku Maharaj Collections : ‘గేమ్ చేంజర్’ వసూళ్లకు దరిదాపుల్లోకి రాలేకపోయిన ‘డాకు మహారాజ్’..13 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఎంతంటే!

బాబీ దర్శకత్వం లో నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి మొదటిరోజు, మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ వచ్చింది. రెగ్యులర్ బాలకృష్ణ సినిమాలు లాగా కాకుండా, కాస్త ఈ చిత్రాన్ని రజినీకాంత్ 'జైలర్' తరహాలో తెరకెక్కించారు. బాలయ్య ని అభిమానులు ఇంతటి సెటిల్ రోల్ లో ఇప్పటి వరకు చూడలేదు. బీభత్సమైన యాక్షన్ సన్నివేశాలు, పేజీల కొద్దీ డైలాగ్స్ చెప్పడాలు వంటివి ఇన్ని రోజులు ఆయన సినిమాలో చూసాము.

Written By:
  • Vicky
  • , Updated On : January 25, 2025 / 09:20 PM IST
    Daku Maharaj Collections

    Daku Maharaj Collections

    Follow us on

    Daku Maharaj Collections :  వరుస విజయాలతో ఇండస్ట్రీ లో దూసుకుపోతున్న హీరోల లిస్ట్ తీస్తే అందులో నందమూరి బాలకృష్ణ పేరు కచ్చితంగా ఉంటుంది. ‘అఖండ’ తర్వాత ఈయన ఫ్లాప్ అనే పదాన్ని మర్చిపోయాడు. ఆయన అభిమానులకు ఈ రేంజ్ గూస్ బంప్స్ రప్పించే సినిమాలు ఇస్తాడని ఇప్పటి వరకు ఎవ్వరూ ఊహించలేకపోయారు. అలాంటి సెన్సేషన్ సృష్టించాడు ఈయన. వరుసగా హ్యాట్రిక్ హిట్స్ తర్వాత, రీసెంట్ గా ఆయన చేసిన ‘డాకు మహారాజ్’ చిత్రం సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. బాబీ దర్శకత్వం లో నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి మొదటిరోజు, మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ వచ్చింది. రెగ్యులర్ బాలకృష్ణ సినిమాలు లాగా కాకుండా, కాస్త ఈ చిత్రాన్ని రజినీకాంత్ ‘జైలర్’ తరహాలో తెరకెక్కించారు. బాలయ్య ని అభిమానులు ఇంతటి సెటిల్ రోల్ లో ఇప్పటి వరకు చూడలేదు. బీభత్సమైన యాక్షన్ సన్నివేశాలు, పేజీల కొద్దీ డైలాగ్స్ చెప్పడాలు వంటివి ఇన్ని రోజులు ఆయన సినిమాలో చూసాము.

    ఈ చిత్రంలో కూడా అలాంటివి ఉన్నాయి కానీ, పూర్తిగా డిఫరెంట్ కోణంలో బాలయ్య ని చూపించి ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ అనుభూతి ని కలిగించాడు. అయితే బాలయ్య ని ఇలా కొత్తగా చూపించడాన్ని అభిమానులు తీసుకోలేక పోయి ఉండొచ్చు. అందుకే కమర్షియల్ గా ఈ చిత్రం టాక్ కి తగ్గట్టు పెద్ద రేంజ్ కి వెళ్లలేకపోయింది. 83 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి ఇప్పటి వరకు కేవలం 74 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఎంత వసూళ్లు వచ్చినా ఇక రేపు మాత్రమే ఫైనల్ అనొచ్చు. ఆ తర్వాత 90 శాతం కి పైగా సెంటర్స్ లో క్లోజింగ్ కలెక్షన్స్ వేసేసుకోవచ్చు. అయితే ఇంత మంచి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా ‘గేమ్ చేంజర్’ కి దరిదాపుల్లోకి వెళ్లలేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

    ఎందుకంటే ‘గేమ్ చేంజర్’ చిత్రానికి మొదటి ఆట నుండే ఘోరమైన డిజాస్టర్ టాక్ వచ్చింది. సోషల్ మీడియా లో ఈ సినిమాకి జరిగినంత నెగటివిటీ, ఇప్పటి వరకు ఏ చిత్రానికి కూడా జరగలేదు. నిర్మాత దిల్ రాజు కూడా ఈ సినిమాకి సంబంధించి కనీసం ఒక్క ప్రెస్ మీట్ ని కూడా పెట్టలేకపోయాడు. ఇదే సంక్రాంతికి రెండు రోజుల గ్యాప్ లో విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి రోజు మార్చి రోజు సక్సెస్ మీట్స్ చేస్తూనే ఉన్నారు. త్వరలోనే భీమవరం లో కూడా ఒక గ్రాండ్ సక్సెస్ మీట్ ని జరపబోతున్నారు. తానూ నిర్మించిన రెండు సినిమాల్లో ఒక సినిమాకి అంత పెద్ద ఎత్తున సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసి, ఇంకో సినిమాని పట్టించుకోకపోవడమంటే, కచ్చితంగా ఆ సినిమాకి టాక్ బాగాలేదు అని జనాలకు చెప్తున్నట్టే కదా?, ఇంత నెగటివిటీ ని ఏర్పాటు చేసుకున్న ‘గేమ్ చేంజర్’ చిత్రం ఫుల్ రన్ కలెక్షన్స్ కి డాకు మహారాజ్ దరిదాపుల్లోకి రాలేకపోయింది అంటూ సోషల్ మీడియా లో రామ్ చరణ్ అభిమానులు బాలయ్య పై ట్రోల్స్ వేస్తున్నారు.