https://oktelugu.com/

Aishwarya Rajesh: నలుగురు హీరోయిన్లు నో చెప్పిన పాత్రను చేసి ప్రశంసలు అందుకుంటున్న ఐశ్వర్య రాజేష్..అసలు వాళ్ళు ఎందుకు నో చెప్పారో తెలుసా…

చాలామంది వద్దనుకున్న పాత్రను చేసి, ఆ సినిమా హిట్ అయ్యి వాళ్లకు మంచి పేరు రావడం కూడా సినిమా ఇండస్ట్రీలో జరిగేదే. ప్రస్తుతం ఇలాంటి ఒక ఆనందంలోనే తేలియాడుతుంది సంక్రాంతికి వస్తున్నాం సినిమా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్.

Written By:
  • Mahi
  • , Updated On : January 16, 2025 / 02:12 PM IST

    Aishwarya Rajesh

    Follow us on

    Aishwarya Rajesh: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో లేదా హీరోయిన్ వద్దన్న పాత్రను ఇంకొకరు చేయడం సాధారణంగా జరిగే పనే. అయితే ఒకరు వద్దన్న పాత్రను మరొకరు చేసి హిట్టు అందుకోవడం కూడా చాలా సందర్భాలలో చూసే ఉంటాం. ఒక హీరో లేదా హీరోయిన్ వదులుకున్న సినిమా ఫ్లాప్ అయితే పర్వాలేదు కానీ ఒకవేళ హిట్ అయితే మాత్రం ఆ సినిమాను మిస్ చేసుకున్నట్టే. అలాగే చాలామంది వద్దనుకున్న పాత్రను చేసి, ఆ సినిమా హిట్ అయ్యి వాళ్లకు మంచి పేరు రావడం కూడా సినిమా ఇండస్ట్రీలో జరిగేదే. ప్రస్తుతం ఇలాంటి ఒక ఆనందంలోనే తేలియాడుతుంది సంక్రాంతికి వస్తున్నాం సినిమా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలలో వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ తో దూసుకుపోతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో హీరో వెంకటేష్ తో పాటు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కూడా ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ నటించిన భాగ్యం పాత్రకు ప్రేక్షకుల నుంచి ఊహించని రేంజ్ లో స్పందన వస్తుంది. భాగ్యం పాత్రకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. అయితే ఈ పాత్రకు ముందు అనుకున్నది ఐశ్వర్య రాజేష్ను కాదట. ఈ సినిమాలో భాగ్యం పాత్ర కోసం దర్శకుడు అనిల్ రావిపూడి ముందుగా ముగ్గురు నలుగురు హీరోయిన్లను సంప్రదించారట. కానీ వాళ్లందరూ ఈ పాత్ర చేయడానికి నో చెప్పారు. దానికి ప్రధాన కారణం నలుగురు పిల్లల తల్లిగా నటించాల్సి వస్తుందని. ఈ విషయాన్ని స్వయంగా ఐశ్వర్య ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది.

    అయితే ఈ విషయం గురించి చెప్పచో లేదో అంటూ దర్శకుడు అనిల్ రావిపూడి దగ్గర అనుమతి తీసుకొని ఐశ్వర్య ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి చెప్పింది. ఈ క్రమంలోనే ఐశ్వర్య వేరే వాళ్లకు అభ్యంతరంగా మారిన విషయం తనకు సమస్యల అనిపించలేదని, పిల్లల తల్లిగా నటించడానికి తనకు ఏమాత్రం ఇబ్బంది లేదని చెప్పుకొచ్చింది. ఈ పాత్రకు ఆమె ఒప్పుకున్నప్పుడు, ఈ సినిమా చూశాక తాము ఏం మిస్ అయ్యాము ఈ సినిమాకు నో చెప్పిన హీరోయిన్లకు అర్థమవుతుందని దర్శకుడు వ్యాఖ్యానించినట్లు ఈ సందర్భంగా ఐశ్వర్య తెలిపింది. ప్రస్తుతం థియేటర్లలో భాగ్యం పాత్రకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసి ఈ పాత్రను మిస్ చేసుకున్న వాళ్లు ఖచ్చితంగా రిగ్రేట్ అవుతారు.

    ఐశ్వర్య రాజేష్ కు తెలుగులో ఈ సినిమా ఒక పెద్ద మలుపు అని చెప్పడంలో సందేహం లేదు. ఐశ్వర్య రాజేష్ దివంగత టాలీవుడ్ నటుడు రాజేష్ కూతురు. ఈమె తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళంలో నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. తెలుగుతోపాటు ఐశ్వర్య రాజేష్ తమిళ్ లో కూడా పలు సినిమాలలో నటించింది. ఈమె తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి, టక్ జగదీష్, రిపబ్లిక్ వంటి పలు సినిమాలలో నటించినప్పటికీ అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. కానీ లేటెస్ట్ గా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ దిశగా వెళుతుండడంతో ఆమె దశ తిరిగినట్లే అని చెప్పొచ్చు.