Maha Kumbh Mela : హర్ష రిచార్య అన్‌టోల్డ్ స్టోరీ: ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో కుంభమేళ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మహా కుంభం నిన్నటి నుంచి అంటే జనవరి 13 నుంచి ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో చాలా అందమైన వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఇక 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహా కుంభానికి వెళ్లడానికి కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సందర్భంగా ఏకంగా 40 నుంచి 45 కోట్ల జనాభా రానున్నారు అని సమాచారం. ఈ మేళకు చాలా విశిష్టత ఉంది. ఇదిలా ఉంటే ఇక్కడికి వచ్చిన సాధ్వి, సాదువులు, అఘోరులు తమ ప్రత్యేకతల వల్ల వైరల్ గా మారుతున్నారు కూడా. ఇప్పుడు అలాంటి ఓ సాధ్వి గురించి తెలుసుకుందాం.
మహాకుంభ్ 2025లో సాధ్వి చిత్రాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. అయితే మహా కుంభంలోని అత్యంత సుందరమైన సాధ్విగా ప్రజల్లో పేరు తెచ్చుకున్న ఈ యువ సన్యాసి ఎవరో మీకు తెలుసా? తెలియకపోతే ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈమె వైరల్ అవడంతో ప్రజలు ఇప్పుడు ఈ యువ సన్యాసిని మహాకుంభంలో అత్యంత అందమైన సాధ్వి అని కొనియాడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సాధ్వి ఫోటోలు మీరు కూడా చూశారా?
నిజానికి, ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహిస్తున్న మహాకుంభ్ 2025కి వచ్చిన సాద్వి పేరు హర్ష రిచారియా, భోపాల్ నివాసి. ఈమె ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో నివసిస్తున్నారు. అయితే హర్ష రిచార్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. హర్ష రిచార్యకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. తను ట్రావెలర్ హర్ష పేరుతో 21 జనవరి 2019న స్వంతంగా YouTube ఛానెల్‌ని స్టార్ట్ చేశారు. ఇక ఇంటర్నెట్‌లో హర్షకి సంబంధించిన చాలా ఫోటోలు ఉన్నాయి.
ఎప్పుడు సాధ్వి అయ్యారు?
హర్ష సాధ్వి కావడానికి సంబంధించిన సమాచారం ఏమిటంటే, ఆమె ఆచార్య మహామండలేశ్వర స్వామి కైలాసా నందగిరి జీ మహారాజ్ శిష్యురాలు. ఆమె సాధ్విగా మారి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే అయింది. హర్ష రిచారియా సోషల్ మీడియా ఖాతా చూస్తుంటే, ఆమె సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా చాలా ఫేమస్ అయినట్లు తెలుస్తుంది.
హర్ష ఇన్‌స్టా ఖాతాలో యాంకర్ హర్ష రిచార్య అని రాశారు. సాధ్వి కాకముందు హర్ష మోడల్‌గా ఉండేవారు. అంతే కాకుండా సెలబ్రిటీ, యాంకర్‌గా కూడా తనదైన ముద్ర వేసుకుంది. ఇక హర్ష రిచార్య సాధ్వి కావడానికి గల కారణాన్ని ‘సుకూన్’ ( సంతోషం) కారణంగా ఆమె సాధ్వి కావాలని నిర్ణయించుకుందట. ఈమెకు ప్రస్తుతం 30 సంవత్సరాలట. ఇంతకుముందు ఆమె మేకప్ ఆర్టిస్ట్‌గా, యోగా శిక్షకురాలిగా కూడా పనిచేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ఎవరో ఆమెను, మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడుగుతున్నట్లు కనిపిస్తుంది. తాను ఉత్తరాఖండ్ నుంచి వచ్చానని చెబుతూనే ఆచార్య మహామండలేశ్వర్ జీ శిష్యురాలినని చెప్పింది.