https://oktelugu.com/

Ram Charan Upasana: క్లింకారా పుట్టాక రామ్ చరణ్, ఉపాసనల మధ్య గొడవలు మొదలయ్యాయా?

2011లో రామ్ చరణ్, ఉపాసన వివాహ బంధంతో ఒకటయ్యారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఆదర్శ దంపతులుగా పేరు సంపాదించారు. కానీ పెళ్లి అయిన 11 సంవత్సరాలు వీరికి సంతానం కలిగింది.

Written By: , Updated On : October 19, 2023 / 12:35 PM IST
Ram Charan Upasana

Ram Charan Upasana

Follow us on

Ram Charan Upasana: చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ను సినిమాలకు పనికిరాడు అని ఎంతో మంది అన్నారు. కానీ అవేం పట్టించుకోకుండా తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగాడు చెర్రీ. నటన, అందం, అనుకువ అన్నీ కలగలపుకొని తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. సినిమాల్లో మాత్రమే కాదు పర్సనల్ లైఫ్ లోనూ మంచి పేరు సంపాదించారు. చెర్రీ భార్య ఉపాసన కూడా ఎలాంటి రిమార్క్ లేకుండా ఉత్తమ ఇల్లాలుగా సాగుతుంది. కానీ ఎందుకో సడన్ గా వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి అనే టాక్ వినిపిస్తుంది. ఇందులో ఎంత నిజం ఉందో తెలుసుకుందాం..

2011లో రామ్ చరణ్, ఉపాసన వివాహ బంధంతో ఒకటయ్యారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఆదర్శ దంపతులుగా పేరు సంపాదించారు. కానీ పెళ్లి అయిన 11 సంవత్సరాలు వీరికి సంతానం కలిగింది. ఇదే సంవత్సరం జూన్ 20వ తేదీన ఈ దంపతులుకు అమ్మాయి పుట్టింది. ఈ చిన్నారికి క్లింకారా అని పేరు పెట్టారు. ఎన్నో సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టడంతో సంతోషంగా ఉన్నారు ఉపాసన రామ్ చరణ్. అయితే చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలో క్రమశిక్షణ, స్ట్రిక్ట్ గా ఉండే ఉపాసన పెళ్లి తర్వాత కూడా అదే ఫాలో అవుతున్నారట. అంతేకాదు చెర్రీ కొన్ని విషయాల్లో టైం టూ టైం చేయకపోయినా ఉపాసన దగ్గర ఉండి మరీ చేపించేదట.

పాప పుట్టడంతో సమయం లేక రామ్ చరణ్ విషయంలో ప్రతి ఒక్కటి చూసుకోలేకపోతుందట ఉపాసన. ఇక చెర్రీ కూడా ముందులానే ఉన్నారట. దీంతో ప్రతీది క్రమంగా, టైం టూ టైం చేయకపోతే చేసిన పనికి ఫలితం ఉండదని.. ఇష్టం వచ్చినట్టు చేస్తే కొన్నింటికి సరైనా ఫలితాలు రావని ఉపాసన హెచ్చరిస్తుందట. ఇక వీరి గొడవలను చూస్తున్న మెగా ఫ్యామిలీ ఉపాసన మాటల్లో అంతరార్థాన్ని గ్రహించి దంపతుల మధ్య కలగజేసుకోవడం లేదట. అంతే కాదు భార్య భర్తల మధ్య కలగజేసుకోవడం కూడా మంచిది కాదని కామ్ గా ఉంటున్నారట మెగా ఫ్యామిలీ.

మరి భార్య మాటల్లో సత్యాన్ని గ్రహించి చెర్రీ జాగ్రత్త పడితే బాగుండు అని మెగా ఫ్యామిలీ అభిమానులు అనుకుంటున్నారు. భర్త విషయంలోనే ఇంత స్ట్రిక్ట్ గా, క్రమశిక్షణగా ఉన్న ఉపాసన పాప విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ వీరు గొడవ పడుతున్నది ఎంత వరకు నిజం అనేది తెలియదు. ఇందులో నిజం ఉంటే.. కొంచెం చెర్రీ మారితే సెట్ అయిపోతుంది అని సలహాలు ఇస్తున్నారు ఈ జంట అభిమానులు.