పవన్ కళ్యాణ్.. ఈ పేరులోనే ఒక పవర్ ఉంది. కానీ పవన్ ని అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉన్నా.. శ్రీరెడ్డి, కత్తి మహేష్, పోసాని కృష్ణమురళి ఇలా.. ఇలాంటి కొందరి వల్ల పవర్ స్టార్ ప్రతిష్ట మసకబారుతోంది. మరో ఏ హీరో మీద ఇలాంటి వ్యక్తులు నోరు పారేసుకోలేదు. పవన్ రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టే .. ప్రత్యర్థి పార్టీల వాళ్ళు ఇలా పవన్ని కావాలని తిట్టిస్తున్నారా ?

నిన్నటి విషయాన్ని తీసుకుందాం.. నటుడు పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ పెట్టి మరీ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యల్లో అత్యంత జుగుప్సాకరమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. సరే పవన్ తీరులో తప్పు ఉంది అనుకుందాం. మరి పోసాని ఇన్నాళ్లు ఏమి చేస్తున్నట్లు ?
అంటే.. జగన్ పై విమర్శలు చేస్తేనే.. పోసాని రంగంలోకి దిగి పవన్ పై అడ్డమైన కామెంట్స్ చేస్తాడా ? పోసాని బూతులు తిడుతుంటే.. పవన్ ఫ్యాన్స్ కోపంతో రగిలిపోయారు. ఆ మాటలు వినలేక వాళ్ళు చెవులు మూసుకున్నారు. పోసాని రాజకీయాల్లో ఎదగడం కోసం.. జగన్ పార్టీ తరఫున విచ్చలవిడిగా రెచ్చిపోతే.. నష్టం పోసానికే.
నిజమే పోసాని ఎవరికీ సపోర్ట్ చేయాలి అనేది ఆయన వ్యక్తిగత విషయం. కాకపోతే రాజకీయ విమర్శలు చేస్తే ఫర్లేదు. వ్యవస్థల్ని దిగజార్చేలా వ్యవహరించకూడదు. పవన్ అభిమానులు ఆవేశంతో ధర్నాలు చేస్తే..? ప్రభుత్వ ఆస్తులు తగలబెడితే ఎవరు బాధ్యులు ? ఈ శ్రీరెడ్డి, కత్తి మహేష్, పోసాని కృష్ణమురళి లాంటి వారి వల్ల ఒక్క పవన్ కే కాదు, సమాజానికి కూడా నష్టమే.