https://oktelugu.com/

Jabardasth And Dhee: జబర్దస్త్, ఢీ ప్రొగ్రామ్స్ పేమెంట్స్ ఇవే.. దానికి దీనికి తేడా ఎంతంటే?

జబర్దస్త్ లో ఒక్కసారి ఎంట్రీ ఇస్తే వారి భవిష్యత్ మారిపోతుందన్న పరిస్థితి నెలకొంది. అందుకే ఇందులో ఛాన్స్ కోసం చాలా మంది ఆరాటపడుతున్నారు. కొందరు రీల్స్ చేస్తూ..

Written By:
  • Srinivas
  • , Updated On : May 6, 2023 3:08 pm
    Follow us on

    Jabardasth And Dhee: సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో చాలా మంది టీవీ బాట పట్టారు. జబర్దస్త్ ప్రొగ్రాం స్టార్ట్ అయిన తరువాత మిగతా ఛానెల్స్ కూడా పలు షోలను నిర్వహిస్తూ యాక్టర్లకు మంచి ఉపాధినిస్తున్నారు. టాలెంట్ ను భట్టి రెమ్యూనరేషన్ కూడా లక్షల్లో ఇవ్వడంతో కొంత మంది సినిమాలను వదిలి టీవీ ప్రొగ్రామ్స్ లోనే నటిస్తున్నారు. అయితే ఇక్కడా డిమాండ్ పెరగడంతో ఒకరికొకరు ఆరోపణలు చేసుకోవడం ప్రారంభమైంది. కొన్ని రోజుల నుంచి జబర్దస్త్ ప్రోగ్రామ్ లో రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తారని, ఇదే ఛానెల్ నిర్వహించే ఢీ ప్రొగ్రామ్ లో తక్కువ ఇస్తారన్న చర్చ సాగుతోంది. ఇటీవల ఓ డ్యాన్స్ మాస్టర్ మృతి చెందడంతో ఈ చర్చ మరీ తీవ్రమైంది. అయితే ఈ ఆరోపణలపై బజర్దస్త్ కంటెస్టెంట్ ఇచ్చిన వివరణ వీడియో వైరల్ అవుతోంది.

    జబర్దస్త్ లో ఒక్కసారి ఎంట్రీ ఇస్తే వారి భవిష్యత్ మారిపోతుందన్న పరిస్థితి నెలకొంది. అందుకే ఇందులో ఛాన్స్ కోసం చాలా మంది ఆరాటపడుతున్నారు. కొందరు రీల్స్ చేస్తూ.. మరికొందరు కామెడీ చేసిన వీడియోలను వైరల్ చేస్తూ జబర్దస్త్ లో ఛాన్స్ కొట్టేస్తున్నారు. ఈ క్రమంలో వారి రెమ్యూనరేషన్ పెరిగిపోతుంది. ఒకప్పుడు జబర్దస్త్ టాప్ రేంజ్ లో కొనసాగింది. దానికి పోటీగా చాలా ప్రోగ్రామ్స్ రావడంతో ప్రస్తుతం దీని రేటింగ్ పడిపోతుంది. దీంతో రెమ్యూనరేషన్ తగ్గిందని అంటున్నారు. అయితేకొందరు కావాలనే ఒకరికి ఎక్కువ.. మరొకరికి తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారని అంటున్నారు.

    బజర్దస్త్ కంటెస్టెంట్ అదిరే ఆబి చెప్పిన వివరాల ప్రకారం బజర్దస్త్ లో ఒక్క షో చేస్తే లక్ష వరకు వస్తుంది. అంటే నెలకు రూ.4 లక్షలు వచ్చినా.. ట్యాక్స్ తదితర ఖర్చులు పోను ఏడాదికి రూ.30 లక్షలు వస్తాయి. ఈ డబ్బుతో కార్లు, బంగ్లాలు ఎవరూ కొనలేరు. కేవలం జబర్దస్త్ ద్వారానే ఎవరూ కోటీశ్వరులు కాలేరు. జబర్దస్త్ తో పాటు ఇతర ఈవెంట్స్ చేసి డబ్బులు సంపాదించిన తరువాతే విలాస వస్తువులు కొనుక్కుంటారు. అయితే బజర్దస్త్ ప్రోగ్రామ్ లో చేస్తే ఇతర ఈవెంట్స్ చేసుకోవడానికి వాళ్లు అవకాశం ఇస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది సినిమాల్లో నటిస్తూ డబ్బు సంపాదించారు.

    ఇటీవల కొందరు జబర్దస్త్ లో రెమ్యూనరేషన్ తగ్గించారని గోల పెడుతున్నారు. జబర్దస్త్ రేటింగ్ బాగా ఉన్నప్పుడు వాళ్లు మంచి పారితోషికం ఇచ్చారు. ఇప్పుడు తక్కువ వస్తున్నప్పడు రెమ్యూనరేషన్ తగ్గించారని తెలుస్తోంది. అయితే కావాలనే రెమ్యూనరేషన్ తగ్గించారని అనడం మాత్రం కరెక్ట్ కాదని జబర్దస్త్ అభి చెప్పుకొచ్చారు. ఇక జబర్దస్త్ ను చాలా మంది రకరకాల కారణాలతో వీడారు. కేవలం రెమ్యూనరేషన్ కారణంగానే వెళ్లినట్లు చెబుతున్న వార్తలు అవాస్తవమని అంటున్నారు.

    ఇదే కాకుండా బజర్దస్త్, ఢీ ప్రొగ్రాం రెమ్యూనరేషన్ కు తేడా ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయి. జబర్దస్త్ లో ఒక టీం లీడర్ ఉంటాడు. తన స్కిట్ బాగా రావడానికి కొంత మంది చేత ప్రొగ్రాం చేస్తాడు. కానీ ఢీ ప్రొగ్రామ్ లో ఒక డ్యాన్స్ మాస్టర్ ఉంటారు. ఆయన కింద ఇద్దరు లేదా 20 మందితోనైనా డ్యాన్స్ బాగా రావడానికి కృషి చేస్తాడు. అవసరతమైన సొంత ఖర్చులు పెట్టుకొని మరీ ప్రొగ్రామ్ ను సక్సెస్ చేస్తారు. అందుకే రెండు ప్రోగ్రామ్స్ మధ్య తేడా ఉందని అదిరే అభి చెప్పుకొచ్చాడు. ఆయన చెబుతున్న వీడియో వైరల్ గా మారింది. ఆ వీడయోను మీరూ చూడండి..