CM Jagan: అందరూ ప్రభుత్వ బాధితులే.. ఆ విషయంలో మినహాయింపులు ఇవ్వని జగన్

సీఎం జగన్ పార్టీ నేతలందర్నీ తమ వారిగా చూడటం లేదు. ఓ వర్గమే తనతో ఉంటుందని..మిగతా వారంతా పార్టీ వారన్నట్లుగా చూస్తున్నారు. ఫలితంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఇప్పుడు బాలినేని వంటి వాళ్లకు  రిక్తహస్తమే ఎదురవుతోంది. రాజకీయంగా హేమాహేమీలైన వీరికే చుక్కలు కనిపిస్తే.. మరి ప్రజల గురించి చెప్పాల్సిన పనిలేదు. 

Written By: Dharma, Updated On : May 6, 2023 3:31 pm
Follow us on

CM Jagan: ఓటు వేసిన వారిది అదే బాధ..ఆ ఓట్లతో గెలిచిన వారిది అదే బాధ.. గెలిపించిన ద్వితీయ శ్రేణి నాయకత్వానిది అదే బాధ.. కష్టాలు తీరుతాయని భావించి ఏకపక్షంగా మద్దతు తెలిపిన వారిది అదే బాధ. చివరకు దేవుడిగా కొలిచిన వారిది అదే బాధ…ఇలా అన్నివర్గాల వారు బాధితులుగా మిగిలింది ఎవరి వల్లో తెలుసా? ఏపీ సీఎం జగన్ వల్ల. వైసీపీ ఏలుబడిలో దగా పడని వర్గమంటూ లేదంటే అతిశయోక్తి కాదు. ఇలా ఏడిపించడానికి కారణం రాజకీయం. నలుగురు నడిచే రూట్లో తాను నడవనన్న టెంపరితనం. ఆ అహంభావమే ప్రజలకు అంతులేని కష్టాలను, నష్టాలను తెచ్చిపెట్టింది. సంక్షేమం మాటున ఎంత డబ్బులు పంచుతున్నా ప్రజల సంతృప్తిని పొందలేకపోతోంది.
అక్కున చేర్చుకున్నా..
తండ్రి లేని పిల్లాడని సానుభూతి చూపారు. తండ్రి పాలనను మెచ్చి వారసుడ్ని అక్కున చేర్చుకున్నారు. తండ్రికి మించి పాలన అందిస్తామని చెప్పడంతో ఏకపక్ష విజయాన్ని అందించారు. తీరా గద్దెనక్కాక ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నారు. తొలి ఏడాదిలో కొత్త కదా నేర్చుకుంటాడని భావించారు. రెండో ఏడాదిలో కురుదుకుంటాడుగా భావించారు. మూడో ఏడాదిలో ఇలా చేస్తున్నాడేంటి అని ఆందోళన చెందారు. నాలుగో ఏట కావాలనే తప్పుచేస్తున్నాడని తెలుసుకొని దూరం జరిగిపోతున్నారు. రఘురామక్రిష్ణం రాజు నుంచి నిన్నటి బాలినేని ఎపిసోడ్ వరకూ అదే కొనసాగింది.
రెక్కలు విరిచి..
వచ్చేది మన రాజ్యం.. మన రామరాజ్యం. అందరి రెక్కల కష్టంతో ఏర్పడిన ప్రభుత్వం కనుక ఫలాలను సైతం అనుభవిద్దామని సెలవిచ్చారు. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులు ఆసక్తి పెంచుకున్నారు. ఇక తమకు తిరుగులేదని భావించారు. సొంత డబ్బులు పెట్టుకొని మరీ పార్టీకి ప్రాధాన్యత ఇచ్చారు. తరువాతే కుటుంబమన్నంత రేంజ్ లో భ్రమపడ్డారు. దీంతో చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదు. కేంద్రం ఇచ్చే నిధులను సైతం పక్కదారి పట్టించారు. ఇలా ఎందుకు జరుగుతోంది? అని అడిగితే ఇక్కడే అంతే అన్న సమాధానం రావడంతో సొంత పార్టీ నేతలే షాక్ కు గురవుతున్నారు. చివరకు తమ చెప్పులతో తామే కొట్టుకుంటున్నారు.
అందరికీ ఒకే ట్రీట్మెంట్
అన్ని రోగాలకు ఒకటే మందు అన్నట్టు.. తర,తమ బేధం చూడడం లేదు. ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారు. నిలదీస్తే సహించలేకపోతున్నారు. అవసరమైతే కేసులు పెడుతున్నారు. లేకుంటూ భౌతిక దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలో అలవాటు చేసుకున్న ఈ విధానాన్ని తమ వారిపై కూడా అనుసరిస్తున్నారు. చిత్తూరులో ప్రశ్నించిన పాపానికి ఓ జడ్పీటీసీని దారుణంగా అవమానించారు. అరెస్టులు చేయించారు.  సీఎం జగన్ పార్టీ నేతలందర్నీ తమ వారిగా చూడటం లేదు. ఓ వర్గమే తనతో ఉంటుందని..మిగతా వారంతా పార్టీ వారన్నట్లుగా చూస్తున్నారు. ఫలితంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఇప్పుడు బాలినేని వంటి వాళ్లకు  రిక్తహస్తమే ఎదురవుతోంది. రాజకీయంగా హేమాహేమీలైన వీరికే చుక్కలు కనిపిస్తే.. మరి ప్రజల గురించి చెప్పాల్సిన పనిలేదు.