Adipurush Advance Bookings: తెలుగు , హిందీ , తమిళం అని తేడా లేకుండా ఎక్కడ చూసినా ప్రస్తుతం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం మేనియా నే కనిపిస్తుంది. ఎప్పటి నుండో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సినిమా ఇది.
కానీ VFX ఎఫెక్ట్స్ మీద ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి తీవ్రమైన నెగటివ్ కామెంట్స్ రావడం తో సినిమాని ఈ నెలకి వాయిదా వేసి, VFX మీద రీ వర్క్ చేసి అద్భుతమైన క్వాలిటీ వచ్చింది అని అనిపించడం తో గ్రాండ్ గా మరో రెండు రోజుల్లో అన్నీ ప్రాంతీయ భాషల్లో విడుదల చెయ్యబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్స్ మరియు ట్రైలర్స్ మూవీ పై అంచనాలను అమాంతం పెంచేసాయి.
రెండు మూడు రోజుల క్రితం నార్త్ ఇండియా మొత్తం హిందీ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఈరోజే ప్రారంభం అయ్యింది. రెస్పాన్స్ కనీవినీ ఎరుగని రేంజ్ లో ఉంది, అసలు టికెట్స్ ఎప్పుడు పెడుతున్నారో, అవి ఎప్పుడు అమ్ముడుపోతున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు.
ఆన్లైన్ లో టికెట్స్ పెట్టినంత సమయం కూడా పట్టడం లేదు, నిమిషాల వ్యవధి లోనే హౌస్ ఫుల్స్ అయిపోతున్నాయి.ఇప్పటి వరకు కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ సినిమాకి అన్నీ వెర్షన్స్ కి కలిపి 10 కోట్ల రూపాయిల గ్రాస్ ని దాటేసినట్టు సమాచారం. ఇంకా చాలా షోస్ ప్రారంభం కావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న ఈ బుకింగ్స్ ట్రెండ్ ని చూస్తూ ఉంటే, కేవలం మొదటి రోజే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ భాషలకు కలిపి వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇప్పటి వరకు #RRR , సాహూ మరియు బాహుబలి 2 చిత్రాలు మాత్రమే ఈ రేర్ ఫీట్ ని అందుకున్నాయి. ఇప్పుడు ‘ఆదిపురుష్’ కూడా ఆ జాబితాలో చేరిపోబోతుంది.