https://oktelugu.com/

Adipurush Closing Collections: ‘ఆదిపురుష్’ క్లోసింగ్ కలెక్షన్స్.. 2 తెలుగు రాష్ట్రాల్లో 50 శాతం కి పైగా నష్టాలు!

ఈ చిత్రాన్ని ప్రభాస్ కి ఉన్న క్రేజ్ తో పాటుగా 3D వెర్షన్ ని విడుదల చెయ్యడం ఆ సినిమాకి ఓపెనింగ్స్ దక్కించడం లో ఉపయోగ పడింది. ముఖ్యంగా ఈ నైజాం ప్రాంతం లో ఈ సినిమాకి 38 కోట్ల రూపాయిలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.

Written By:
  • Vicky
  • , Updated On : July 17, 2023 10:48 am
    Adipurush

    Adipurush

    Follow us on

    Adipurush Closing Collections: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ఆదిపురుష్ చిత్రం ఈమధ్యనే ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. మొదటి ఆట నుండే డివైడ్ టాక్ రావడం, దానికి తగ్గట్టుగా బోలెడన్ని వివాదాల్లో ఈ సినిమా చిక్కుకోవడం వల్ల ఆడియన్స్ ని ఈ చిత్రం ఆకట్టుకోవడం లో విఫలం అయ్యింది.

    అందువల్ల ఓపెనింగ్స్ ప్రభాస్ కి ఉన్న క్రేజ్ వల్ల అద్భుతంగా వచ్చినప్పటికీ, క్లోసింగ్ కలెక్షన్స్ మాత్రం బయ్యర్స్ కి చావు దెబ్బ తీసేలా చేసింది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ తెలుగు వెర్షన్ కి కలిపి 190 కోట్ల రూపాయిలకు జరగగా, క్లోసింగ్ లో కేవలం 108 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. అంటే దాదాపుగా 50 శాతం నష్టాలు అన్నమాట. మరి ప్రాంతాల వారీ గా ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.

    ఈ చిత్రాన్ని ప్రభాస్ కి ఉన్న క్రేజ్ తో పాటుగా 3D వెర్షన్ ని విడుదల చెయ్యడం ఆ సినిమాకి ఓపెనింగ్స్ దక్కించడం లో ఉపయోగ పడింది. ముఖ్యంగా ఈ నైజాం ప్రాంతం లో ఈ సినిమాకి 38 కోట్ల రూపాయిలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ పంతం లో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 50 కోట్ల రూపాయిలకు జరగగా, ఫుల్ రన్ లో 12 కోట్ల నష్టం వచ్చింది అన్నమాట. అలాగే సీడెడ్ లో 10 కోట్ల 80 లక్షల రూపాయిలు, ఉత్తరాంధ్ర లో 10 కోట్ల 70 లక్షల రూపాయిలు , గుంటూరు లో 7 కోట్ల రూపాయిలు, తూర్పు గోదావరి జిల్లాలో 6 కోట్ల 20 లక్షల రూపాయిలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 5 కోట్ల 10 లక్షల రూపాయిలు, కృష్ణ జిల్లాలో 4 కోట్ల 90 లక్షల రూపాయిలు, నెల్లూరు లో 2 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాబట్టింది. అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా లో 11 కోట్ల రూపాయిలు, మరియు ఓవర్సీస్ లో 12 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి ప్రపంచవ్యాప్తంగా 108 కోట్ల రూపాయిల వసూళ్లను సొంతం చేసుకుంది. ఇది కేవలం తెలుగు వెర్షన్ కి సంబంధించిన డేటా మాత్రమే.