https://oktelugu.com/

Wallet: పర్సును ఎలా ఉంచుకోవాలో తెలుసా?

పర్సులో ఎట్టి పరిస్థితుల్లో కూడా బిల్లులు పెట్టుకోకూడదు. మన ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఇచ్చే బిల్లులు పర్సులో పెట్టుకుంటాం. ఇలా పెట్టుకోకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. దీంతో మనకు ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే బిల్లులు ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్సులో ఉంచుకోవడం అంత మంచిది కాదు.

Written By:
  • Srinivas
  • , Updated On : July 17, 2023 / 10:44 AM IST

    Wallet:

    Follow us on

    Wallet: మనం డబ్బు దాచుకోవడానికి పర్సును వాడతాం. దాన్ని ఎలా పడితే అలా పెట్టుకోకూడదు. దానికి కూడా వాస్తు నియమాలు ఉన్నాయి. అవి పాటించకపోతే ఇబ్బందులు తలెత్తుతాయి. ఈనేపథ్యంలో పర్సు నిర్వహణ కూడా మంచి అలవాటుగానే చూడాలి. అందులో పెట్టుకునే డబ్బులు ఇతర వస్తువుల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. లేకపోతే మన ఎదుగుదల మీద ప్రభావం పడుతుంది. అందుకే పర్సు చక్కగా ఉంచుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది.

    బిల్లులు పెట్టుకోవద్దు

    పర్సులో ఎట్టి పరిస్థితుల్లో కూడా బిల్లులు పెట్టుకోకూడదు. మన ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఇచ్చే బిల్లులు పర్సులో పెట్టుకుంటాం. ఇలా పెట్టుకోకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. దీంతో మనకు ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే బిల్లులు ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్సులో ఉంచుకోవడం అంత మంచిది కాదు.

    బొమ్మలు కూడా వద్దు

    బతికున్న వారి ఫొటోలు, చనిపోయిన వారి ఫొటోలు కాని పర్సులో పెట్టుకోకూడదు. దేవుళ్ల ఫొటోలు కూడా ఉంచుకోవద్దు. ఇలాంటి ఫొటోలు పెట్టుకోవడం వల్ల మనకు ఆర్థిక నష్టాలు రావడం సహజం. అందుకే ఫొటోలు పర్సులో ఉంచుకోవడం అంత శ్రేయస్కరం కాదు. ఇంకా కొందరు పర్సులో బండి కీస్ పెడుతుంటారు. అది కూడా మంచి పద్ధతి కాదు. ఇలా చేస్తే నెగెటివ్ ఎనర్జీ వేధిస్తుంది.

    చిరిగిన నోట్లు

    కొంతమంది చిరిగిన నోట్లు పర్సులో పెట్టుకుంటారు. ఎప్పుడు కూడా చిరిగినవి పక్కన పడేయాలి. కానీ పర్సులో పెట్టుకుని తిరగకూడదు. అలాంటి నోట్లు ఉంటే మార్చుకోవాలి. చిరిగిపోయిన పర్సు వాడకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి నిలువ ఉండదు. కొత్త పర్సు కొనుక్కోవడం మంచిది. పాత పర్సు కలిసివచ్చిందని వాడకూడదు. ఇలా పర్సు విషయంలో కూడా నియమనిబంధనలు చూసుకోవాలి.