Aditya Om On Allu Arjun: లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో హీరో అయ్యాడు ఆదిత్య ఓమ్. ఆ మూవీ సూపర్ హిట్ కావడంతో ఆయనకు వరుస ఆఫర్స్ వచ్చాయి. అయితే లాహిరి లాహిరి లాహిరిలో రేంజ్ హిట్ ఆయనకు మళ్ళీ పడలేదు. ఇరవైకి పైగా చిత్రాల్లో నటించిన ఆదిత్య ఓమ్ దర్శకుడిగా, నిర్మాతగా కూడా వ్యవహరించారు . ఆయన లేటెస్ట్ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దేశంలోనే అల్లు అర్జున్ నెంబర్ వన్ హీరో అని ఆయన వెల్లడించారు. నార్త్ ఇండియాలో ఆయన క్రేజ్ చూస్తే మతిపోతుందన్నారు.
ఉత్తరప్రదేశ్, బీహార్, నేపాల్ తో పాటు పలు రాష్ట్రాల్లో ఆయనకు అభిమానులు ఉన్నారని అన్నారు, ఖాన్ బ్రదర్స్ కూడా ఆయన తర్వాతే అని చెప్పుకొచ్చారు. 80లలో ఖాన్స్ వచ్చారు. తర్వాత అక్షయ్ కుమార్ వచ్చారు. వాళ్ళ తర్వాత మరో మాస్ హీరో రాలేదని ఆదిత్య ఓమ్ అన్నారు. ఇక టాలీవుడ్ కి చెందిన ప్రభాస్, ఎన్టీఆర్ లకు కూడా నార్త్ లో మంచి ఫాలోయింగ్ ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఆర్ ఆర్ ఆర్ అనంతరం రామ్ చరణ్ కి కూడా నార్త్ లో అభిమానులు ఏర్పడ్డారని అన్నారు.
ఆదిత్య ఓమ్ అభిప్రాయంలో అల్లు అర్జున్ ఇండియాలోనే నెంబర్ వన్ హీరో. ఇక సౌత్ ఇండియాలో కూడా అల్లు అర్జున్ కి ఇతర రాష్ట్రాల్లో క్రేజ్ ఉంది. ముఖ్యంగా కేరళలో ఆయనకు అభిమాన సంఘాలు ఉన్నాయి. తెలుగుకు సమానమైన క్రేజ్, స్టార్డం అక్కడ అనుభవిస్తున్నారు. అల్లు అర్జున్ ప్రతి సినిమా మలయాళంలో డబ్ చేసి విడుదల చేస్తున్నారు.
పుష్ప మూవీతో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగింది. పుష్ప హిందీలో అనూహ్య విజయం సాధించింది. ఫస్ట్ డే పుష్ప దారుణ వసూళ్లు అందుకుంది. రివ్యూలు కూడా నెగిటివ్ గానే ఇచ్చారు. అయితే మెల్లగా పుంజుకున్న పుష్ప వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో సీక్వెల్ పై భారీ హైప్ ఏర్పడింది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ జరుపుకుంటుంది. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
”North india lo young heroes ledhu kabatti @alluarjun No.1, #Prabhas No.2, @TheNameIsYash No.3
There is no doubt #AlluArjun craze north lo meeru choosthe you will be shocked-UP, Bihar,MP,Nepal. He is No.1 in India”-
Actor #AdityaOm #Pushpa2TheRule pic.twitter.com/oiErqq2yuj
— Adopted Son Of Kerala (@ASOKERALA) July 16, 2023