Major: శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అవడి శేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం మేజర్. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సోని పిక్చర్స్, జీ. మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై మహేష్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికోసం కోసం అడివి శేష్ ఎంతో కష్టపడుతున్నారు. మొదట స్క్రీన్ టెస్ట్ పెట్టిన చిత్రబృందం.. అడవిశేష్ అందుకు సరిగ్గా సరిపోయారని అందుకు సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. కాగా, ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న మేజర్.. ప్రస్తుతం చివరి భాగానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా కోసం అడవి శేషు పడుతున్న కష్టాన్ని చూస్తున్న అభిమానులు.. సినిమా ఓ రేంజ్లో ఉంటుందోనని అంచనాలు వేస్తున్నారు. ఇందులో శోభిత ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాశ్‌రాజ్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. తెలుగుతో పాటు హిందీ భాషలో కూడా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇటీవలే శేషు హీరోగా వచ్చిన గూఢచారి, క్షణం, ఎవరు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇదిలా ఉండగా, శశి కిరణ్ డైరెక్షన్లో శేషుకు ఇది రెండో సినిమా. వీరిద్దరి కలయికలో మొదట గూఢచారి సినిమా వచ్చింది. మరోవైపు శోభితతో కలిసి ఇదే సినిమాలో నటించారు శేషు.