https://oktelugu.com/

Donald Trump: నా యాల్ది.. డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనిచేశాడే?

Donald Trump:  మొన్నటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫాఫం మన డోనాల్డ్ ట్రంప్ ఓడిపోయాడు. తన జిగ్రీ దోస్తు భారత ప్రధాని నరేంద్రమోడీ వచ్చి ప్రచారం చేసినా కూడా ట్రంప్ ను అమెరికన్లు ఇంటికి పంపారు. నాడు ఎన్నికల సందర్భంగా అమెరికా ప్రఖ్యాత సోషల్ మీడియాలు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లు సైతం ట్రంప్ కు షాకిచ్చి అతడి వాయిస్ ప్రజలకు చేరకుండా బ్లాక్ చేశాయి. దీంతో ఆనాడే ట్రంప్ డిసైడ్ అయ్యాడు. ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 21, 2021 / 03:46 PM IST
    Follow us on

    Donald Trump:  మొన్నటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫాఫం మన డోనాల్డ్ ట్రంప్ ఓడిపోయాడు. తన జిగ్రీ దోస్తు భారత ప్రధాని నరేంద్రమోడీ వచ్చి ప్రచారం చేసినా కూడా ట్రంప్ ను అమెరికన్లు ఇంటికి పంపారు. నాడు ఎన్నికల సందర్భంగా అమెరికా ప్రఖ్యాత సోషల్ మీడియాలు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లు సైతం ట్రంప్ కు షాకిచ్చి అతడి వాయిస్ ప్రజలకు చేరకుండా బ్లాక్ చేశాయి. దీంతో ఆనాడే ట్రంప్ డిసైడ్ అయ్యాడు. ఈ సోషల్ మీడియాలతో తన గొంతు నొక్కేస్తున్నారని.. తానే పెడుతానని డిసైడ్ అయ్యాడు.

    TRUMPTRUTH

    అప్పట్లో అమెరికా అధ్యక్ష భవనంపై దాడి తర్వాత ట్విట్టర్ , ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియాలు డొనాల్డ్ ట్రంప్ ను బహిష్కరించాయి. 9 నెలల పాటు ట్రంప్ ఇంటర్నెట్ లో తన వాయిస్ వినిపించలేకపోయారు. ఈ క్రమంలోనే ట్రంప్ కొత్త సోషల్ మీడియా పెట్టాలని డిసైడ్ అయ్యాడు.

    అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంతంగానే సోషల్ మీడియాను ప్రారంభించి సంచలనం రేపాడు. ఎన్నాళ్లీ ఈ దిగ్గజ సోషల్ మీడియాలపై ఆధారపడడం అనుకొని సొంతంగా తనే ఒక సోషల్ మీడియాను ప్రారంభించడం విశేషం. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ (టీఎంటీజీ)ను ట్రంప్ తాజాగా ఏర్పాటు చేశారు.

    ట్రంప్ ‘ట్రూత్ సోషల్’ పేరుతో ఒక కొత్త సోషల్ మీడియాను ఏర్పాటు చేశాడు. వచ్చే నెల దాని బీటా వెర్షన్ ప్రారంభం కాబోతోంది. ఫ్రీ ఆర్డర్ల కోసం ఇది ఇప్పటికే యాపిల్ స్టోర్ లో అందుబాటులో ఉంచారు. క్రూరమైన భారీ టెక్ కంపెనీలకు వ్యతిరేకంగా తాను ‘ట్రూత్ సోషల్’ అనే సోషల్ మీడియాను ఏర్పాటు చేశానని ట్రంప్ తెలిపారు. తాలిబన్ల వాయిస్ వినిపిస్తున్న ట్విట్టర్ అమెరికా అధ్యక్షుడి నోరు మాత్రం నొక్కేసింది. అందుకే సొంతంగా సోషల్ మీడియా పెట్టాను అంటూ ట్రంప్ ప్రకటించడం విశేషం.