https://oktelugu.com/

Varalaskhmi Sarath Kumar: సమంత “యశోద” సినిమాలో ముఖ్య పాత్ర చేయనున్న… నటి వరలక్ష్మి శరత్ కుమార్

Varalaskhmi Sarath Kumar: వరలక్ష్మి శరత్‌ కుమార్… దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు చాలా మందికి పరిచయం ఉండే ఉంటుంది. తమిళ్ లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న వరలక్ష్మి తెలుగులోనూ మంచి పాత్రలను అందుకుంటుంది. సందీప్‌ కిషన్‌ హీరోగా తెరకెక్కిన ‘తెనాలి రామకృష్ణ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైందీ బ్యూటీ. ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ… ఇటీవల రవితేజ హీరోగా తెరకెక్కిన ‘క్రాక్‌’ సినిమాతో సాలిడ్ హిట్ ను అందుకుంది. ఇక […]

Written By: , Updated On : December 15, 2021 / 06:37 PM IST
Follow us on

Varalaskhmi Sarath Kumar: వరలక్ష్మి శరత్‌ కుమార్… దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు చాలా మందికి పరిచయం ఉండే ఉంటుంది. తమిళ్ లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న వరలక్ష్మి తెలుగులోనూ మంచి పాత్రలను అందుకుంటుంది. సందీప్‌ కిషన్‌ హీరోగా తెరకెక్కిన ‘తెనాలి రామకృష్ణ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైందీ బ్యూటీ. ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ… ఇటీవల రవితేజ హీరోగా తెరకెక్కిన ‘క్రాక్‌’ సినిమాతో సాలిడ్ హిట్ ను అందుకుంది. ఇక అప్పటి నుంచి టాలీవుడ్ లో వరలక్ష్మి పేరు మారు మోగింది. ఈ సినిమాలో ‘జయమ్మ’ పాత్రలో నటించిన వరలక్ష్మి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత నరేష్ నటించిన నాంది సినిమాలో కీలక పాత్రలో నటించి ఆకట్టుకుంది వరలక్ష్మి శరత్‌ కుమార్. ఇప్పుడు తాజాగా తెలుగులో ఓ క్రేజీ ప్రాజెక్టు కి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.

Varalaskhmi Sarath Kumar

actress varalakshmi sarath kumar going to act in samantha yashoda movie

Also Read: నెటిజన్​ కామెంట్​కి దిమ్మతిరిగే కౌంటర్​ ఇచ్చిన రష్మిక

సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్న సినిమా ‘యశోద’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఇప్పుడు ఈ సినిమాలో కీలకమైన పాత్ర కోసం నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ను ఎంపిక చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ‘యశోద’ ఈ నెల 6న ప్రారంభమై నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటోంది. బుధవారం వరలక్ష్మి షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ప్రధాన తారాగణంపై ఈ నెల 23 వరకూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్ జరుపుకోనుందని, జనవరి 3 నుంచి రెండో షెడ్యూల్ మొదలు పెట్టి మార్చికి సినిమా మొత్తాన్ని పూర్తి చేస్తామంటున్నారు నిర్మాత. జాతీయస్థాయిలో అందరినీ ఆకట్టుకునేలా థ్రిల్లర్ కథాంశంతో తీస్తున్న చిత్రమిదని అంటున్నారు దర్శకనిర్మాతలు. ప్రస్తుతం తమిళంలో ఏకంగా 6 సినిమాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉంది వరలక్ష్మి శరత్‌ కుమార్. ఈ చిత్రంలో మధుబాల గా ఆమె నటించనుంది.

Also Read: ఈ పోరాటం ఏదో స్టీల్ ప్లాంట్ కోసం చేయండి… షణ్ముఖ్ ఫ్యాన్స్ పై నెటిజన్స్ ఫైర్!